BigTV English

Chandigarh: ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. భారీగా డబ్బు, తుపాకులు స్వాధీనం..

Chandigarh: అక్రమ మైనింగ్‌ కేసులో హరియాణా నేత దిల్‌బాగ్‌ సింగ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల రూపాయల నగదు బయటపడింది. విదేశాల్లో తయారు చేసిన తుపాకులు, అక్రమంగా నిల్వచేసిన 100 మద్యం బాటిళ్లు, కేజీల కొద్ది బంగారం, వెండిని తనిఖీల్లో బయటపడ్డాయి . దిల్‌బాగ్‌కి చెందిన అనుచరుల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించగా శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి.

Chandigarh: ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. భారీగా డబ్బు, తుపాకులు స్వాధీనం..
Chandigarh

Chandigarh: అక్రమ మైనింగ్‌ కేసులో హర్యానా నేత దిల్‌బాగ్‌ సింగ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కోట్ల రూపాయల నగదు బయటపడింది. విదేశాల్లో తయారు చేసిన తుపాకులు, అక్రమంగా నిల్వచేసిన 100 మద్యం బాటిళ్లు, కేజీల కొద్దీ బంగారం, వెండి ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. దిల్‌బాగ్‌కి చెందిన అనుచరుల నివాసాల్లో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించగా శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి.


ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌(ఐఎన్‌ఎల్‌డీ) నేత దిల్‌బాగ్‌ సింగ్‌తోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురేందర్‌ పన్వార్‌ నివాసాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ చట్టం కింద కర్నాల్‌, ఫరీదాబాద్‌, సోనిపట్, మొహాలీ, చండీగఢ్‌, యమునా నగరాల్లో ఏకకాలంలో 20 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. యమునా నగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనింగ్‌పై జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధం విధించింది. ఆ తర్వాత కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వీరిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై పలు కేసులు పోలీసులు నమోదు చేశారు. ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్‌ కింద దర్యాప్తు చేపట్టింది.

యమునానగర్ మాజీ ఎమ్మెల్యేగా సింగ్ పని చేశారు. పన్వార్ ప్రస్తుతం సోనిపట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ దాడులలో అనేక అక్రమ మైనింగ్‌కు సంబంధించిన దస్త్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దీనిపై ఈడీ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు.


Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×