Modi Warning: కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక.. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించాక.. తొలిసారి తెలంగాణ గడ్డ మీద కాలు మోపారు నరేంద్రమోడీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లాంఛనప్రాయంగా ముగిశాక.. పరేడ్‌గ్రౌండ్ నుంచి తెలంగాణ బీజేపీకి దశ, దిశను నిర్దేశిస్తారని.. కార్యకర్తల్లో జోష్ నింపుతారని.. బెంగాల్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అనే విషయాన్ని గట్టిగా చెబుతారని అంతా అనుకున్నారు. తన ప్రసంగంలో మోడీ కూడా ఈ అంశాలను టచ్ చేశారు. కానీ, ఇప్పుడు చర్చ దాని గురించి జరగడం లేదు. దేశం మొత్తం మోడీ అలా ఎందుకన్నారు? అనే దాని గురించే చర్చించుకుంటోంది. మోడీ ఏమన్నారో ఒక్కసారి వింటే.. మున్ముందు ఎలా ఉండబోతోందనే దానిపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
అదీ.. విషయం! సికింద్రాబాద్ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా పెను సంచలంగా మారాయ్. సంక్షోభం ముంచుకొస్తోంది.. సిద్ధంగా ఉండండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు.. సామాన్యుల్లో కలవరం రేపుతుంటే, ఆర్థిక నిపుణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోలేదని, దాని ప్రభావం భారతదేశంపై మరింత తీవ్రంగా ఉండబోతోందని మోడీ హెచ్చరించారు. ప్రధానంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడంపై పీఎం ఫోకస్ పెట్టారు. అందుకోసమే.. విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానిని సాధించేందుకు కొన్ని మార్గాలను కూడా సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని, వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. మధ్యతరగతి కుటుంబాలు ఏడాది పాటు విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో.. సప్లై చైన్‌లో అంతరాయం ఏర్పడింది. ఇది.. ప్రపంచం మొత్తం ప్రభావం చూపింది. ఇండియాపై.. దీని ఇంపాక్ట్ మరీ ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారు.
ముఖ్యంగా.. భారత్‌లో చమురు వనరులు ఎక్కువగా లేవని, మన అవసరాలకు కావాల్సిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయ్. మన అవసరాల్లో 85 శాతానికి పైగా చమురు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల.. చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి దగ్గర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే, మన పొరుగు దేశాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయన్నారు మోడీ. యుద్ధం మొదలయ్యాక తలెత్తిన ఈ సంక్షోభం వల్ల.. ప్రజలపై అనవసర భారం పడకుండా, ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తోందన్నారు ప్రధాని. ఇదంతా విన్నాక.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనే విషయం అర్థమైంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తే అవకాశం ఉంన్నందున, కోవిడ్ కాలం నాటి జాగ్రత్తలను, పొదుపుని పాటించాలని సూచించారు. అవసరమైతే.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని చెప్పారు.
Also read: Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
వంటనూనెల విషయంలోనూ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. దిగుమతి భారం తగ్గించుకునేందుకు ప్రజలు తమ వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఇది ప్రజల ఆరోగ్యానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిదన్నారు. ఇక.. వ్యవసాయానికి కీలమైన రసాయన ఎరువుల కోసం కూడా.. భారత్ విదేశాలపైనే ఆధారపడుతోంది. యుద్ధ పరిస్థితుల వీళ్ల వీటి ధరలు ఇప్పుడే ఆకాశాన్నంటుతున్నాయ్. వీటి ధరలు పెరిగితే సామాన్య రైతులపై భారం పడుతుంది. అందుకే, ఎరువుల వినియోగాన్ని 50 శాతం తగ్గించి, ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఇక.. భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతోందని పీఎం మోడీ అభిప్రాయపడ్డారు. కనీసం.. ఏడాది పాటు బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోండని కోరడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు.. కోవిడ్ సమయంలో అలవాటు చేసుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియా కాన్ఫరెన్సింగ్ పద్ధతులను మళ్లీ అమలు చేయాలని సూచించారు. కార్ పూలింగ్, మెట్రో రైళ్లు వాడాలన్నారు. ప్రధాని మోడీ చెప్పింది విన్నాక.. దేశం ఒక రకమైన ఎకనమిక్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, సప్లై చైన్ దెబ్బతినడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం లాంటి అంశాలు.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇబ్బందిగా మారాయ్. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు వంద డాలర్లు దాటినప్పటి నుంచి మన రూపీపై ప్రెజర్ పెరుగుతోంది. విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతుండటంతో.. దేశం లోపల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం ప్రధాని మోడీ వ్యూహంగా కనిపిస్తోంది. అందువల్ల.. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదు, దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మన అలవాట్లని మార్చుకొని.. ఆర్థిక వ్యవస్థకు అండగా నిలబడటం కూడా దేశ భక్తే. అయితే.. సంక్షోభం ముంచుకొస్తుందా అంటే.. సమాధానం అవుననే వినిపిస్తోంది. సో.. ఇది భయపడాల్సిన సమయం కాదని, బాధ్యతగా వ్యవహరించిన సమయం. విలాసాలకు స్వస్తి చెప్పి, స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ సంక్షోభానికి విరుగుడు అని ప్రభుత్వం భావిస్తోంది.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో.. స్టాక్ మార్కెట్ నుంచి క్రూడ్ ఆయిల్, బంగారం, వెండి, రూపాయి వరకు అన్ని రంగాల్లో తీవ్రమైన అస్థిరత కనిపిస్తోంది. గతేడాదే బంగారం ధరల్లో చరిత్రాత్మక పెరుగుదల కనిపించింది. బంగారం విలువ 60 శాతానికి పైగా పెరిగింది. యుద్ధం కారణంగా ఏర్పడిన అస్థిర పరిస్థితులను తట్టుకునేందుకు పెట్టుబడిదారులు సంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా డాలర్‌పై ఆధారపడటం తగ్గి, బంగారంపై ఆధారపడటం పెరుగుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ విధానాల వల్ల స్టాక్ మార్కెట్ అనేక ఎదురుదెబ్బలు తిన్నది. ఫలితంగా, పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారం, వెండి లాంటి విలువైన లోహాల్లోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక ఉన్న అత్యంత ముఖ్యమైన కారకాల్లో మరో అంశం కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ఆధిపత్యం క్షీణిస్తుండటమే ఈ చర్యలకు కారణమంటున్నారు. ఈ మార్పు బంగారం ధరలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది.
Also Read: బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేస్ ఫైల్.. బాధాకరం అంటూనే మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!