BigTV English

Exit Polls 2023 | ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదంటే?

Exit Polls 2023 | తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ ముగియడంతో అసెంబ్లీ ఎన్నికల జరిగిన అయిదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇంతకు మందు మిజోరం నవంబర్ 7న, ఛత్తీస్ గఢ్ రెండు విడతల్లో నవంబర్ 7, నవంబర్ 17న, మధ్యప్రదేశ్ నవంబర్ 17న, రాజస్థాన్ నవంబర్ నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఈ అయిదు రాష్ట్రాల్లకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..

Exit Polls 2023 | ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదంటే?

Exit Polls 2023 | తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ ముగియడంతో అసెంబ్లీ ఎన్నికల జరిగిన అయిదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఇంతకు మందు మిజోరం నవంబర్ 7న, ఛత్తీస్ గఢ్ రెండు విడతల్లో నవంబర్ 7, నవంబర్ 17న, మధ్యప్రదేశ్ నవంబర్ 17న, రాజస్థాన్ నవంబర్ నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. ఈ అయిదు రాష్ట్రాల్లకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన లీడ్ సాధించి.. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. పీపుల్స్ పల్స్ మధ్యప్రదేశ్‌ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు 117-139 సీట్లు గెటుపొందే అవకాశం ఉండగా, బిజేపీ 91-113 స్థానాల్లో కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇతర పార్టీలకు 0-8 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.

అలాగే ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పీపుల్స్ పల్స్ ఛత్తీస్ గడ్ ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం 90 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 54-64 సీట్లలో విజయం సాధించే అవకాశాలుండగా.. బిజేపీ మాత్రం 29-39 సీట్లకే పరిమితం కానుంది.


కానీ రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. పీపుల్స్ పల్స్ రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్‌లో భారతీయ జనత పార్టీ లీడ్ సాధించింది. రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. బిజేపీకి 95-115 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 73-95 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇతర పార్టీలు 8-21 సీట్లు సాధించే అవకాశముంది.

ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్(MNF) ముందంజలో ఉంది. మొత్తం 40 అసెంబ్లీ సీట్లున్న మిజోరంలో MNF పార్టీ 16-20 స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం 6-10 స్థానాల్లకే పరిమితం కానుంది. అలాగే ఇతర పార్టీలకు 12-17 స్థానాలు సాధించే అవకాశం ఉంది. విశేషమేమిటంటే మిజోరంలో ఏ పార్టీ కూడా స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన సీట్లు లేవు. దీంతో ఇక్కడ కూటమి రాజకీయాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చివరగా తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ప్రీపోల్ సర్వేలు చెప్పిన ఫలితాలే ఎగ్జిట్ పోల్స్ లోనూ వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని సర్వేలు.. సంస్థలు తేల్చేశాయి. పీపుల్స్ పోల్ సర్వే ప్రకారం అధికార బిఆర్ఎస్ 41-49 సీట్లు గెలుపొందే అవకాశాలుండగా.. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో 58-67 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. బిజేపీ మాత్రం 5-7 సీట్లకే పరిమితం కానుంది. అలాగే మిగతా పార్టీలైన ఎంఐఎం, సిపిఐ, సిపిఎం లకు 7-9 సీట్లు గెలిచే అవకాశం ఉంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×