E-Paper
Advertisement

Delhi Blast: ఢిల్లీలో మరో పేలుడు.. భయంతో జనాలు పరుగులు

Delhi Blast: ఢిల్లీలో మరో పేలుడు.. భయంతో జనాలు పరుగులు
Advertisement

Delhi Blast: ఢిల్లీలో మరో పేలుడు సంభవించింది. మహిపాల్‌పూర్ ప్రాంతంలోని రాడిసన్ హోటల్ సమీపంలో.. పెద్ద శబ్దంతో పేలుడు లాంటి సంఘటన చోటుచేసుకుంది. క్షణాల్లో ఆ ప్రాంతం మొత్తం అలెర్ట్‌ అయింది. స్థానికులు, హోటల్ సిబ్బంది, ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఉదయం 9.18కి ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి పేలుడు ఆధారాలూ లేవని, ఇది తప్పు అలర్ట్ మాత్రమే అని నిర్ధారించారు. ఈ అలర్ట్‌కు కారణం ఒక మహిళ నుంచి వచ్చిన కాల్ అని పోలీసులు తెలిపారు. పేలుడు శబ్దం వచ్చిన ప్రదేశంలో పరిశీలించగా.. అక్కడున్న డీటీసీ బస్సు టైర్ పేలడం భారీ శబ్దం వచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అక్కడ ఎలాంటి ఘటన చోటుచేసుకోకపోవడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా గత రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో.. జరిగిన కారు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా, మరో 20 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఇది ఆత్మాహుతి దాడి అయనా కావచ్చు. లేకపోతే పేలుడు పదార్ధాలు తరలిస్తున్నప్పుడు యాక్సిడెంటల్ బ్లాస్ట్ అయినా అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు అధికారులు. ఈ పేలుడు ఎలా సంభవించిందనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ పేలుడుకు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడుకు గురైన కారులో ఉన్న వ్యక్తి డాక్టర్ మహ్మద్ ఉమర్‌గా గుర్తించారు. ఇతను ఫరీదాబాద్ మాడ్యూల్‌లో ఉగ్రవాది అని నిఘా వర్గాలు తేల్చాయి.

Advertisement

Also Read: విశాఖలో 4 ఐటీ కంపెనీలకు.. లోకేష్ శంకుస్థాపన

ఫరీదాబాద్‌‌లో భారీ స్థాయిలో 2,900 కిలోల పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, డాక్టర్ల ముసుగులో ఉన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ వార్తా దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో తాను కూడ పట్టుబడతాననే భయంతో టెర్రరిస్ట్ ఉమర్ ఈ దాడికి పాల్పడటం కానీ, లేక తన దగ్గరున్న పేలుడు పదార్ధాలను మరొక చోటుకి తరలించేందుకు చేసిన ప్రయత్నం వల్ల కానీ.. ఈ ఘటన జరిగి ఉండవచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి.

Advertisement

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×