E-Paper
Advertisement

Military Station : మిలిటరీ స్టేషన్ పై కాల్పులు.. నలుగురు మృతి.. ఎక్కడంటే..?

Military Station : మిలిటరీ స్టేషన్ పై కాల్పులు.. నలుగురు మృతి.. ఎక్కడంటే..?
Advertisement

Attack on Military base(National News) : పంజాబ్‌ లో సైనిక శిబిరంపై కాల్పులు కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల సమయంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌ పై ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది.సైనిక స్థావరంలోని శతఘ్ని యూనిట్‌లో కాల్పుల ఘటన జరిగినట్లు సమాచారం. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిగిన ప్రాంతంలోనే సైనికుల కుటుంబాలు నివసిస్తున్నాయి.

కాల్పులు శబ్దం వినిపించగానే మిలటరీ స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు.

Advertisement

ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, 28 తూటాలు మిసైయ్యాయి. కాల్పులకు వాటినే వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులు జరిగిన మిలిటరీ స్టేషన్‌ వద్దకు పంజాబ్‌ పోలీసులు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు ఆధీనంలోకి తీసుకోవడంతో వారిని లోపలికి అనుమతించలేదు.

బఠిండా వ్యూహాత్మకంగా కీలక సైనిక స్థావరం. ఇక్కడ 10వ కోర్‌ కమాండ్‌కు చెందిన దళాలు ఉన్నాయి. జైపూర్‌ కేంద్రంగా పనిచేసే సౌత్‌-వెస్ట్రన్‌ కమాండ్‌ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తోంది. బఠిండాలో భారీగా ఆపరేషనల్‌ ఆర్మీ యూనిట్లు, కీలక ఆయుధాలున్నాయి.

Related News

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

Big Stories

Advertisement
×