Ashok Khemka: మాజీ ఐఏఎస్ అశోక్ ఖేమ్కా ఇప్పుడిప్పుడే వార్తల్లోకి వస్తున్నారు. నీతి-నిజాయితీకి కేరాఫ్ ఆయన. అవినీతిపై అలుపెరగని పోరాటం ఆయన సొంతం. అసాధారణమైన కెరీర్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు. ఆయన 34 ఏళ్ల కెరీర్‌లో 57సార్లు బదిలీ అయ్యారు. సగటున ప్రతి ఆరునెలలకు ఒక్కసారి బదిలీ అయ్యేవారు. దేశంలోని ఎక్కువ సార్లు బదిలీ వారిలో అశోక్‌ది సెకండ్ ప్లేస్.
ఐఏఎస్ లేదా ఐపీఎస్ బాధ్యతలు తీసుకున్న మొదట్లో తమ శాఖ మంత్రులను కలుస్తారు. ఆ సమయంలో అవినీతిని ప్రొత్సహించేలా మాట్లాడుతారు సదరు మంత్రులు. అధికారులు వ్యవహారశైలికి ఇదొక చిన్న పరీక్ష. అధికారులు మొండి కేస్తే చిన్నపరీక్ష పెట్టామని సర్దుకుంటారు. ఈ విషయాన్ని చాలామంది ఐఏఎస్ లేదా ఐపీఎస్‌లు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెప్పారు.
నీతి- నిజాయితీకి కేరాఫ్
నిజాయితీగా పని చేసేవారిలో హర్యానాకు చెందిన మాజీ ఐఏఎస్ అశోక్ ఖేమ్కా ఒకరు. 34 ఏళ్ల సర్వీసులో ఆయన 57 సార్లు ట్రాన్స్‌పర్ అయ్యారు. అంటే దాదాపు ఆరునెలల చొప్పున బదిలీ అయ్యేవారన్నమాట. 2012లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు అశోక్ ఖేమ్కా. గురుగ్రామ్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిట-డీఎల్ఎఫ్ మధ్య మూడున్నర ఎకరాల లాండ్ డీల్ మ్యూటేషన్‌ను రద్దు చేశారు.
ఆ విధంగా వార్తల్లోకి వచ్చారాయన. అప్పుడు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వం, ఆయనను సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. గతేడాది డిసెంబరులో బదిలీపై రవాణాశాఖకు వచ్చారు అశోక్. పదేళ్ల కిందట ఆ శాఖలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఆ తర్వాత నాలుగు నెలలకే బదిలీ అయ్యారు. రెండు రోజుల కిందట అంటే ఏప్రిల్ 30న రిటైర్ అయ్యారు.
ALSO READ: చున్ చున్ కే బదా లేంగే పహల్ గామ్‌పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్
అవినీతిని నిర్మూలించేందుకు తనకు నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు తీసుకోవాలని భావించారు. దీనిపై రెండేళ్ల కిందట అప్పటి హర్యానా ప్రభుత్వానికి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కీలకమైన విషయాలు ప్రస్తావించారు. అవినీతిని చూసినప్పుడు తన మనసు తల్లడిల్లుతుందని తెలిపారు. కెరీర్ చివరి దశలో తాను ఈ విభాగంలో సేవలు అందించాలనుకుంటున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.
ఆయన సొంతూరు
ఆ సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను, ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార శాఖకు బదిలీ చేసింది హర్యానా ప్రభుత్వం. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లో సాగిన ఖేమ్కా, ఆర్కైవ్స్ శాఖలో పని చేయడం నాలుగోసారి. పశ్చిమ బెంగాల్ కి చెందిన అశోక్ ఖేమ్కా, 1965 ఏడాది కోల్‌కతాలో జన్మించారు.
1988లో ఐఐటీ ఖరగ్‌పుర్ నుంచి సీఎస్‌ఈలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. చివరకు ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీలు సాధించి సివిల్స్‌కు సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు హర్యానాలో పోస్టింగ్ వేశారు. దేశంలో ఎక్కువ శాతం బదిలీ అయినవారిలో అశోక్ ఖ్కేమా రెండోవారు. అంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ ప్రదీప్ కస్నీ 71సార్లు బదిలీ అయ్యారు.