BigTV English

Pakistan Terror Network: పాక్ టెర్రర్ నెట్ వర్క్ వర్త్ ఎంత? ఇంటిలిజెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు

Pakistan Terror Network: పాక్ టెర్రర్ నెట్ వర్క్ వర్త్ ఎంత? ఇంటిలిజెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు

పాకిస్థాన్ లో 80 నిషేధిగ ఉగ్రవాద గ్రూపులు

పాకిస్థాన్ ఉగ్రదేశం ఎలా అయ్యిందని చూస్తే.. ఒక పెద్ద లిస్టు బయట పడుతుంది. దీని ఆధారంగా చూస్తే నిషేధిత తీవ్ర వాద ఉగ్రవాద గ్రూపులే సుమారు 80 వరకూ ఉంటాయి. వీటిలో యాక్టివ్ గా ఒక 45 ఉండగా.. పెద్ద యాక్టివ్‌గా లేని గ్రూపులు ఒక పాతిక వరకూ ఉంటాయి. వీటిలో లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమద్ మరింత హైపర్ యాక్టివ్‌గా ఉంటాయి.


ఉగ్రవాద గ్రూపుల్లో చేరే పాక్ మాజీ సైనికులు

మాములుగా భారత్ వంటి దేశాల్లో మిలటరీలో పని చేసి రిటైర్ అయ్యాక.. వారు చేసే పని సెక్యూరిటీ జాబ్స్ లోకి ఎక్కువగా వెళ్లడం.. అదే పాకిస్థాన్ లో మాజీ సైనికులు ఉగ్రవాద గ్రూపుల్లో చేరుతుంటారు. దీన్నిబట్టీ ఈ రెండు దేశాలకు ఎంత తేడా ఉందో చూసుకోవచ్చు. పాకిస్థాన్‌లో మాజీ సైనికులకు ఇదొక ఆదాయ వనరు.

జిహాదీ గ్రూపులకు ట్రైనింగ్ ఇచ్చేది మాజీ సైనికులే

పాకిస్థాన్ గత కొన్ని దశకాలుగా ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషించిందని చూస్తే.. ఇందులో మాజీ సైనికులది అత్యంత కీలక పాత్రగా తెలుస్తోంది. మాజీ సైనిక సిబ్బంది అత్యంత క్రూరమైన లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమద్ వంటి ఉగ్రసంస్థలకు శిక్షణనిచ్చే జిహాదీ శిబిరాలను నడుపుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం.

ముంబై కసబ్, పహెల్గాం ముగ్గురు ఉగ్రవాదులు

భారత్ యువత ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్ జాబ్స్ కొట్టడానికి ఎలాంటి ప్రాధాన్యతనిస్తారో.. పాకిస్థాన్ లో ఉగ్రవాదాన్ని అలా ఆశ్రయిస్తారు. తమ తమ ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కోవడంలో భాగంగా టెర్రరిజం ఒక ఆప్షన్‌గా పెట్టుకుంటారు అక్కడి యువకులు. మరీ ముఖ్యంగా భారీ ఎత్తున డబ్బు సంపాదించే మార్గాల్లో వారు టెర్రరిజం ఒక రూట్ మ్యాప్‌గా మార్చుకుంటారు. కసబ్ వంటి వారు అలా వచ్చిన వారే. తాజాగా పహెల్గామ్‌లో దాడి చేసి 26 మందిని హతం చేసిన ఉగ్రవాదులదీ ఇదే తీరు. వీరందరినీ తీర్చి దిద్దేది మాజీ సైనికులే అన్నది మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్.

పాక్ లో మోస్ట్ డేంజరస్ టెర్రర్ గ్రూపులు- సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్

పహెల్గాం దాడికి పాల్పడ్డ వారు ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన వారు కారు. వీరు కొన్ని దశకాలుగా పాక్‌లో వేయి తలలు వేస్తోన్న ఉగ్రవాద ఉత్పత్తులు. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ టెర్రర్ గ్రూపులు పాకిస్థాన్ కేంద్రంగా తిష్ట వేసి ఉన్న విషయాన్ని.. సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్స్ వంటి కొన్ని సంస్థలు ఒక జాబితా సైతం రూపొందించాయి. వీటిలో లష్కరే తోయిబా మూడు, జైష్ ఏ మహమద్ ఏడవ స్థానంలో ఉన్నాయి.

పార్ట్ టైం దేశ రక్షణ, ఫుల్ టైం జిహాదీస్టుల శిక్షణ

పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవారు.. పార్ట్ టైమ్‌గా దేశరక్షణ చేస్తే.. ఫుల్ టైమ్‌గా చేసే జాబ్ మాత్రం.. సైనికులను జిహాదిస్టులుగా తయారు చేయడం. దక్షిణాసియా వ్యాప్తంగా కొన్ని దశకాల తరబడి ఉగ్రవాదాన్ని ఈ తరహాలోనే పెంచి పోషిస్తోంది పాకిస్థాన్. ఇక్కడ సైనికుడికి, జిహాదిస్టుకీ పెద్ద తేడా ఉండదు. వారి మధ్య పెద్ద వ్యత్యాసాలుండవు. వారిని తీర్చి దిద్దే విషయంలో సపరేట్ కోర్సులుండవు. అంతా ఒకటే. ఇద్దరినీ ఒకలాగానే తయారు చేస్తారని చెబుతాయి కొన్ని రిపోర్టులు.

పాక్ సోల్జర్ కి టెర్రరిస్టులకు లేని తేడా

పాక్ ఆర్మీలో చేరి తాము నేర్చుకున్న మిలటరీ ట్రైనింగ్, ఉగ్రవాద శిక్షణా శిబిరాల్లో నేర్పిస్తుంటారు ఆ దేశ సైనికులు. ఇంటెలిజెన్స్ వర్గాల వారి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మాజీ సైనికులే ఉగ్రవాద శిబిరాలను నడుపుతుంటారు. ఉగ్రవాదులు అంటే అనఫిషియల్ పాక్ సోల్జర్స్ కింద లెక్క. వారు జీతం, హోదాలతో పని చేస్తారు. వీరు ఎలాంటి హోదా లేకుండా టెర్రరిస్టుగా దేశానికి పని చేస్తారు. అంతే తేడా. ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం.. సన్నటి రేఖ వంటిది అంతే.

లష్కరే, జైషే లకు పాక్ నిధులు

2019లో పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని బలికొన్ని లష్కరే తోయిబా, జైష్ ఏ మొహమద్ వంటి ఉగ్రసంస్థలకు పాకిస్థాన్ నిధులను ఇస్తూ ఉంటుంది. ఈ సంస్థలు పాక్ భూభాగమంతటా విస్తరించి ఉంటాయి. శిక్షణా శిబిరాలు నిర్వహిస్తుంటాయి. రాడికలైజేషన్, ఆయుధ శిక్షణ, ఆత్మాహుతి దళాల తయారీ కేంద్రాలుగా ఇవి నానాటికి పెరుగుతున్నాయే తప్ప ఎంత మాత్రం తగ్గడం లేదు. వీటన్నిటికీ పాకిస్థాన్ మాజీ సైనికులే నిర్వాహకులు.

పాక్..వరల్డ్స్ టెర్రరిస్ట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్- యూఎస్

పాకిస్థాన్ అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ని గుర్తించి చంపిన అమెరికా.. ఈ ఆపరేషన్ గురించి చెబుతూ.. ఇస్లామాబాద్ ఉగ్రవాదులకు ఎలాంటి సహాయ సహకారాలను అందిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మించిన ఉదాహరణ లేదని తేల్చి చెప్పింది.

2008, 2011 దాడులు.. పాక్ ప్రేరేపితమే

చైనా వరల్డ్స్ ప్రొడక్షన్ హౌస్ కాగా, భారత్ వరల్డ్ సర్వీస్ సెక్టార్ కే హెడ్ క్వార్టర్.. ఈ రెండు దేశాలకు ఈ పేరు ఎలాంటిదో.. పాకిస్థాన్ కి వరల్డ్స్ టెర్రరిస్ట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ గా అంతటి పేరుంది. దీని వెనక కీలకంగా పని చేస్తోంది పాక్ మాజీ సైనిక వర్గాలే. కాబూల్ లోని భారత్ అమెరికా రాయబార కార్యాలయాలపై జరిగిన 2008, 2011 దాడులు, 2005 లండన్ దాడులు, 2024 మాస్కో దాడులు సైతం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగమే. ఒక్కో గల్ఫ్ దేశం పెట్రోలు, డీజిల్ వంటి ఆయిల్ ప్రొడక్టులు అమ్మి సొమ్ము చేసుకుంటే పాకిస్థాన్ మాత్రం టెర్రరిజం అమ్మి సొమ్ము చేసుకుంటుంది. ఆ దేశాన్ని ఏలిన నవాజ్ షరీఫ్, ముషరఫ్ వంటి వారు చేసిన ఓపెన్ కామెంట్సే ఇందుకు సాక్షి.. 26\11 ముంబై దాడుల వంటి ఘటనలలో ఇస్లామాబాద్ హస్తం ఉన్నట్టు వారు ఒప్పుకున్న పరిస్థితులున్నాయి.

పాక్ కి అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న టెర్రర్ జబ్బు

వైద్య పరిభాషలో చెబితే ఉగ్రవాదం అనే జబ్బు ఈ దేశం అడ్వాన్స్డ్ స్టేజీలో ఉంది. ఉగ్రవాదం ఆపేస్తే పాకిస్థాన్ ఖేల్ ఖతం. ఆ దేశ జీడీపీలో 24 శాతం వ్యవసాయం నుంచి వస్తే, ఉగ్రవాదం నుంచి కూడా అంతే మొత్తం సంపాదిస్తుందన్న పేరుంది. మత పరమైన విద్య అభ్యసించడం. ఆపై జీహాదీ గ్రూపుల్లో చేరడం. ఇలాంటి టెర్రరిస్టు అటాక్స్ చేయడానికి భారీ మొత్తంలో పొందడం.. ఇదొక రూట్ మ్యాప్. తాజాగా పెహల్గాం దాడి చేయడానికి కాశ్మీర్ కి వచ్చిన టెర్రరిస్టులు ఈ దిశగా తయారై వచ్చిన వారే అంటారు నిఘా వర్గాల వారు.

22\4 టెర్రర్ అటాక్స్ కి పాక్ లింకులు

ఏప్రిల్ 22 నాటి పహెల్గాం దాడికి పాకిస్థాన్ తో లింక్ అయి ఉన్నట్టుగా.. భారత భద్రతా సంస్థలు ఆధారాలతో సహా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాయి. ఈ సమాచారాన్ని యూఎస్, యూకే, ఫ్రాన్స్,జర్మనీ, రష్యా, ఇటలీతో పాటు చైనాకు కూడా స్పష్టం చేశాయి.

ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా పాక్ లో మూలాలు

పాకిస్థాన్ లో ఆ దేశ రాజకీయ నాయకులకు, మరే ఇతర ప్రముఖులకు లేనంత ప్రాధాన్యత భద్రత ఉగ్రవాద సంస్థాధిపతులకు కల్పిస్తుంటారు. ఎందుకంటే ఆ దేశం టెర్రరిస్టు ఆధారిత దేశం. దీంతో వారి అడుగులకు మడుగులు వత్తుతుంటారు. భారత్ కి వ్యతిరేకంగా వారు ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తే మరింత ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెలాంటి టెర్రర్ అటాక్స్ జరిగినా దాని మూలాలు పాక్ లో వెతుక్కోవచ్చు. ఇక్కడి నుంచే ఆ సహాయ సహకారాలు అందుతుంటాయి. దీనంతటి వెనక పాకిస్థాన్ ఆర్మీలో పని చేసిన మాజీ సైనికులే ఉంటారు. పాకిస్థాన్ ఆర్మీ, టెర్రరిజం విడదీయలేని అనుబంధంగా చెబుతున్నాయి నిఘా వర్గాల నివేదికలు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×