E-Paper
Advertisement

Rajasthan : పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురి మృతి..

Rajasthan : పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురి మృతి..
Advertisement

Rajasthan: రాజస్తాన్‌ లోపెళ్లి వేడుక తీవ్ర విషాదాన్ని నింపింది. వివాహ విందు కోసం వంటలు తయారు చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారి రెండు గ్యాస్‌ సిలిండర్‌లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్స్యువాత పడ్డారు. సుమారు 60 మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఈ ప్రమాదం రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న భుంగ్రా గ్రామంలో జరిగింది.

గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి పెళ్లి జరుగుతున్న ఇంటిలోని ఓ భాగం కుప్పకూలింది. తీవ్ర స్థాయి పేలుడు సంభవించిందని అధికారులు ప్రకటించారు. గాయపడిన వారిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్‌ హిమాన్షు గుప్తా తెలిపారు. రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సాయంత్రం గాయపడిన వారిని పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

గ్యాస్ సిలిండర్ల పేలుడుతో పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన వారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మీయులను కోల్పోయామని ఆవేదన చెందుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×