E-Paper
Advertisement

Bihar : క్రికెట్ గేమ్ లో జాక్ పాట్.. కోటిన్నర గెలిచిన గ్యాస్‌ డెలివరీ బాయ్‌..

Bihar : క్రికెట్ గేమ్ లో జాక్ పాట్.. కోటిన్నర గెలిచిన గ్యాస్‌ డెలివరీ బాయ్‌..
Advertisement

Bihar : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో మనం ఊహించలేం. బిహార్ లోని ఓ యువకుడికి అదృష్టం క్రికెట్ గేమ్ రూపంలో తలుపు తట్టింది. అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేస్తుంటాడు. అతడు డ్రీమ్‌-11 యాప్‌లో ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌ ఆడి ఏకంగా రూ.కోటిన్నర జాక్‌పాట్‌ కొట్టాడు.

సాదిఖ్‌ అనే యువకుడు స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న సాదిఖ్‌ జనవరి 14న జరిగిన భారత్‌-అఫ్గానిస్థాన్‌ టీ20 మ్యాచ్‌ సందర్భంగా రూ.49 పెట్టి డ్రీమ్‌-11లో గేమ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో సాదిఖ్‌ తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. దీంతో సాదిఖ్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

Advertisement

తన వద్ద పనిచేసే వ్యక్తికి జాక్ పాట్ తగలడంపై గ్యాస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జితేంద్ర స్పందించారు. సాదిఖ్‌ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగానే.. ఆ నగదును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామని వెల్లడించారు.

Tags

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×