Glacial Lake Outburst: భూటాన్‌లో భారీ హిమానీనద సరస్సు బద్దలైంది. దీంతో దిగువ ప్రాంతాలు వరద వస్తోంది. ఈ క్రమంలో అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు వరద ముప్పు పొంచి ఉంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎల్‌నినో దెబ్బకు హిమాలయ ప్రాంతాల దేశాలు వణికిపోతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతాయని బెంబేలెత్తుతున్నారు. రీసెంట్‌గా నేపాల్‌లో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ఈ క్రమంలో హిమాలయాలు ఉండే దేశాల ప్రజల్లో టెన్షన్ మొదలైంది. తాజాగా భూటాన్‌లోని హిమానీనద సరస్సు బద్దలైంది. సింటాఫు అనే సరస్సు రాత్రి బద్దలైనట్లు తెలుస్తోంది.
భూటాన్‌లోని మొత్తం 17 ప్రమాదకరమైన హిమానీనదాల సరస్సులు ఉన్నాయి. అందులో షింటాఫు సరస్సు ఒకటి. ఇది మో చ్చు నదికి మూలం స్థానం. ఈ హిమానీనద సరస్సుల నుండి అకస్మాత్తుగా భారీగా నీటిని విడుదల చేయడం వల్ల దిగువ ప్రాంతాలలో వరద ముప్పు ఏర్పడింది. ఈ ఆందోళన దృష్ట్యా ఆ నది ప్రవాహం ప్రాంతాలైన అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో వివిధ జిల్లాలను అధికారులు అలర్ట్ చేశారు. ఏ క్షణమైన వరద వచ్చే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో హెచ్చరిక జారీ చేయడంతోపాటు సైరన్‌లు నిరంతరం మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని అలీపుర్‌దువార్, జల్పైగురి జిల్లా యంత్రాంగాలు నదీ పరీవాహన ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. అలీపుర్ దువార్ జిల్లాలోని కుమార్‌గ్రామ్‌లో సంకోష్ నది వెంబడి నివసిస్తున్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. జల్పైగురి జిల్లాలోని బనార్‌హాట్‌లోని స్థానికులను యంత్రాంగం అప్రమత్తం చేసింది.
పశ్చిమ బెంగాల్ అటవీశాఖ మంత్రి మనోజ్ కుమార్ ఓరాన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భూటాన్ నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహం కొద్ది గంటల్లో అలీపుర్‌దువార్ జిల్లాలోని కుమార్‌గ్రామ్ ప్రాంతం గుండా ప్రవహించే సంకోష్ నదిని చేరుకోవచ్చన్నారు. ముందు జాగ్రత్తగా నది సమీప ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు.. ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించాలన్నారు. వదంతులను పట్టించుకోకుండా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ALSO READ: రూ.5 చిప్స్ ప్యాకెట్ కొంటే మోసం.. లేస్ కంపెనీకి రూ.8,000 జరిమానా విధించిన కోర్టు
మరోవైపు భూటాన్ సౌర ప్రాజెక్టు ఆకస్మిక వరదకు డ్యామేజ్ అయ్యింది. పునాఖాలోని గుమా గెవాగ్ పరిధిలో దోచ్చుఖా-జోమ్లింగ్‌థాంగ్-రిట్సా చివాగ్‌లో సాగునీటి సమస్యలను పరిష్కరించడానికి ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేశారు. రాత్రి మో చ్చు నదిలో సంభవించిన ఆకస్మిక వరద కారణంగా పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది.
🇧🇹 BHUTAN : A solar-powered irrigation lifting system in Guma Gewog, Punakha, has been partially damaged by last night’s flash flood in the Mo Chhu.
Debris has also covered a section of the Punakha–Gasa Highway at Dzomlingthang.
Source: Local Tshogpa via BBS#Bhutan #FloodUpdate… pic.twitter.com/wiT5s3AQRC— Sikkim Media (@SikkimMedia) October 30, 2026