Intinti Ramayanam Today Episode October 30th: ఆరాధ్య ఆమ్లెట్ అడిగింది అని అవని తనకి ఆమ్లెట్ వేసిస్తూ తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి ఆరాధ్యును బాబు దగ్గరికి వెళ్ళమని పంపించి అవనితో మాట్లాడుతుంది. ఆ పల్లవి ఎవరెన్ని చెప్పినా కూడా అసలు వినకుండా తన పని ఇంట తను చేసుకొని పోతుంది. తనతో మాట్లాడడం కూడా వేస్తే అని చెబుతుంది పార్వతి. తను మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసిందో చూశాం కదా నేను చంపేస్తాను అని అంది అదే నాకు భయంగా ఉంది అని పార్వతి భయపడిపోతూ ఉంటుంది. కానీ అవని మాత్రం పల్లవి అన్నవన్ని చెయ్యదు కదా అత్తయ్య నువ్వేమి కంగారు పడకు అని అంటుంది. కానీ మీ మామయ్య విషయంలో ఇలా చేసిన తర్వాత నాకు ఏది నమ్మాలో కూడా అర్థం కావడం లేదు అని అనగానే.. అక్కడ ఉన్న కమల్ ఆ మాటలు విన్నడేమో అని కంగారు పడిపోతుంది పార్వతి.. కానీ కమల్ చార్జింగ్ అయిపోవడం వల్ల ఏమీ వినిపించలేదు అని అంటాడు దాంతో వాళ్ళు వినలేదు అని అనుకుంటారు.
ఈరోజు శ్రేయ శ్రీకర్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది.. మంజుల మన ప్లాన్ ప్రకారం దొరికింది కాబట్టి తనని ఎలాగైనా సరే పట్టుకోవాలి ఆ డాక్యుమెంట్స్ ని తీసుకొని వచ్చి తన మరిదికి ఇవ్వాలి అని శ్రీకర్ మాట్లాడుతూ ఉండగా నువ్వు మంచిగానే ప్లాన్ చేశావు నిజంగానే మంజుల దొరుకుతుంది లే అని శ్రీ అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవని శ్రీకర్ కి జాగ్రత్తలు చెప్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఆ మంజులని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తుంది.
పల్లవి భరత్ ఇద్దరు కూడా అవని ఇంటికి వచ్చి ఇలా మాట్లాడటం అసలు బాగోలేదు.. కమలు ఇలాంటి పనిచేయడం వల్లే ఆ అవని ఇంటికి వచ్చి ఇలా వార్నింగ్ ఇచ్చింది అని ఇద్దరు కూడా చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే నువ్వు అను సిస్టర్ ఆ కమల్ ను ఏదో ఒకటి చేస్తాను ఆ కమల్ వల్లే ఇదంతా జరిగింది అని భరత్ అంటాడు. అయితే నా మనమని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చంపేస్తావా ఏంటి అని భానుమతి భరత్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ఇ స్తుంది. అవని వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఆ అవని నేను ఏదో ఒకటి చేస్తాను నాకు బాగా తెలుసు అని అంటుంది పల్లవి. అయితే ఇప్పటివరకు నీ తింగరితనంతోనే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు ఇప్పటికైనా నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించు అని భానుమతి సలహా ఇచ్చి వెళ్తుంది.
అక్షయ్ చాలా సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ కనిపించడం చూసి అవన్నీ చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూద్దాం. మొదటిసారి మీరు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అవని. కానీ అక్షయ్ మాత్రం పల్లవి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ సంతోషం పెరిగింది అందుకే ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుంటుంది అని పెడుతున్నాను.. అయితే అక్షయ్ చాలా సంతోషంగా ఉండడం చూసి అవన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. పల్లవి నీ సొంత చెల్లి అని నువ్వు వెనకేసుకొని వచ్చావు ఇప్పుడు పల్లవి ఇలా చేసింది అని తెలిసి నువ్వు ఇలా కమ్మలకి సపోర్ట్ చేస్తున్నావు అంటే చాలా సంతోషంగా ఉంది అని అక్షయ్ అంటాడు.. కమల్ ఒంటరిగా పడుకోవడం చూసి ఫీల్ అయిపోతాడు అక్షయ్.
రమ్య తన అన్నయ్య ఎక్కడికి వెళ్లాడో అర్థం కావడం లేదు అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అన్నయ్య ఎక్కడికి వెళ్లాడు ఏం చేస్తున్నాడు అర్థం కావడం లేదు ఇంత టైం అయినా ఇంకా రాలేదు కదా ఎక్కడికి పోయాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రమ్య. అయితే అప్పుడే ఎవరో కలుపుకొట్టడంతో ఎవరు వచ్చారు అని కంగారు పడిపోతూ ఉంటుంది.. బయట ఒక వ్యక్తి కనిపించడంతో షాక్ అవుతుంది రమ్య. అయితే రమ్య ఆ వ్యక్తి వంకరగా చూస్తున్నాడని అర్థం చేసుకుంటుంది అయితే రమ్య మీద ఆయన అఘాయిత్యం చేయబోతాడు. రమ్య దాంతో చాలా భయపడిపోతుంది. అన్నయ్య తాగొచ్చి అందరి చేత ఇలా అనిపిస్తున్నాడు అని బాధ పడిపోతూ ఉంటుంది.
పల్లవి లాయర్ తో ఎలాగైనా సరే కోర్టులోనే తేల్చుకోవాలి అని అనుకుంటుంది. అయితే కోర్టుకు వెళ్లగానే అక్కడ అవని ఇరికించి కమల్ తో నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని ఆలోచిస్తూ ఫోన్ మాట్లాడుతూ వస్తుంది ఎదురుగా వచ్చిన అవనిని చూసి సడన్ గా బ్రేక్ వేస్తుంది. ఎలాగైనా సరే అవనితో తేల్చుకోవాలి అని అనుకుంటుంది అయితే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను అని పల్లవి అనడంతో పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా అవని కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంది. కానీ పల్లవి మాత్రం అవనితో నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. నువ్వు చూస్తూ ఉండు అని చాలెంజ్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..