E-Paper
Advertisement

రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!

రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!
Advertisement

Lottery Winner: రూ. 200 తో కొన్న ఒక్క లాటరీ టిక్కెట్ ఆ కుటుంబాన్ని రాత్రికి రాత్రే వార్తల్లో నిలిచేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు ఏకంగా రూ. 50 లక్షల విలువైన ‘టయోటా ఫార్చ్యూనర్’ లగ్జరీ SUV కారును లాటరీలో గెలుచుకున్నాడు. ఈ అరుదైన సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నానమ్మ ఆలోచన.. మనవడికి అదృష్టం!

బుర్హాన్‌పూర్ పరిధిలోని సీలంపూర్‌కు చెందిన మేధాంశ్ రైక్వార్ అనే ఆరేళ్ల బాలుడికి ఈ అదృష్టం వరించింది. ఏడాది క్రితం అభాపురి ధామ్‌లో జరిగిన గర్బా వేడుకలకు వెళ్లిన అతడి నాయనమ్మ కిరణ్ రైక్వార్.. రూ. 200 పెట్టి లక్కీ డ్రా కూపన్ కొనుగోలు చేశారు. ఆ కూపన్‌పై తన మనవడు మేధాంశ్ పేరు రాసి బాక్స్ వేశారు. ఈ క్రమంలో లక్కీ డ్రా ఓపెన్ చేయగా.. అందులో బాలుడి పేరు వచ్చింది.

ఊరంతా పండుగ వాతావరణం

Advertisement

అభాపురిలోని శ్రీ సర్కార్ ధామ్‌లో నిర్వహించిన లక్కీ డ్రాలో మొదటి బహుమతి విజేతగా మేధాంశ్ పేరును ప్రకటించారు. ఈ వార్త తెలియగానే రైక్వార్ కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. కారున్న లొకేషన్‌కు చేరుకొని కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి, దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. మేళతాళాలతో స్థానికులు, లక్కీ డ్రా నిర్వాహకులు బాలుడికి ఘన స్వాగతం పలికారు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Advertisement

కాగా, ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారింది. రూ. 200 తో రూ. 50 లక్షల కారు గెలుచుకోవడం నిజంగా ‘జాక్‌పాట్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘నాయనమ్మ ప్రేమ.. మనవడికి ఎంత పెద్ద గిఫ్ట్ తెచ్చిపెట్టిందో చూడండి’ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు బాలుడి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: కరెంట్, ఐస్ లేకుండానే వ్యాక్సిన్లు కూల్.. ఇండోర్ కుర్రాళ్ల అద్భుతమైన ఆవిష్కరణ!

టయోటా ఫార్చ్యూనర్ ధర

దేశంలో అత్యంత క్రేజ్ కలిగిన ప్రీమియం ఎస్ యూవీ కార్లలో టయోటా ఫార్చ్యూనర్ ఒకటి. ప్రస్తుతం దేశంలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 35.11 లక్షల నుండి మెుదలై టాప్ వేరియంట్ (GR-S) ధర రూ. 50.97 లక్షల వరకు పలుకుతోంది. బుర్హాన్‌పూర్ ప్రాంతంలో రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి దీని ఆన్ రోడ్ ధర సుమారు రూ. 41.85 లక్షల నుండి రూ. 61.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

Also Read: నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!

Tags

Related News

రాజకీయ యాత్ర కాదు.. దేశ ఆత్మ కోసం, రామ్‌లీలా యాత్రపై తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ

సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!

17 మంది ఖైదీల పరారీ ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఆ రోజు జైల్లో ఏం జరిగిందంటే?

అర్ధరాత్రి అనుభవం.. క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం, ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్

భర్తను వదిలి మరో వ్యక్తితో 10 ఏళ్లు సహజీవనం చేసిన భార్య.. భరణం కేసులో కోర్టు తీర్పు ఇదే

ఆరేళ్ల బాలుడికి జాక్‌పాట్.. ఏకంగా రూ.50 లక్షల కారు, అదెలా సాధ్యం?

భారతీయ పైలట్‌కు యూఏఈ అత్యున్నత అవార్డుతో సత్కారం.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×