E-Paper
Advertisement

రాజకీయ యాత్ర కాదు.. దేశ ఆత్మ కోసం, రామ్‌లీలా యాత్రపై తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ

రాజకీయ యాత్ర కాదు.. దేశ ఆత్మ కోసం, రామ్‌లీలా యాత్రపై తేల్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
Advertisement

Rahul Gandhi: చలో ఢిల్లీ మార్చ్ అనేది దేశం కోసం ఒక విశిష్టమైన నిరసన అని తేల్చేశారు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజలందరూ రావాలని పిలుపు నిచ్చారు. ఇది రాజకీయ యాత్ర కారదని, దేశ ఆత్మ కోసమని తేల్చేశారు. దీపావళి వేళ మార్చ్‌ను వాయిదా వేయాలని స్థానిక వ్యాపారులు కోరినా, దాన్ని సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేశారు.

రామ్‌లీలా యాత్రపై రాహుల్‌గాంధీ క్లారిటీ

ఓట్ల దొంగతనం, ఓటర్ల అవకతవకలకు వ్యతిరేకంగా నవంబర్ ఒకటిన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌ వేదికగా చలో ఢిల్లీ యాత్ర నిర్వహించాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. దీనికి అన్ని రాజకీయ అనుబంధాలకు చెందిన విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాలతో కలిసి ఈ నిరసనలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా రాజ్యాంగాన్ని రక్షించాలనుకునేవారు మార్చ్‌లో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

నవంబర్ ఒకటిన అందరూ రావాలని పిలుపు

Advertisement

దీపావళి తర్వాత మార్చ్‌ను నిర్వహించాలని ఢిల్లీ వ్యాపారులు కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించాయి. ఈ విషయంలో రాహుల్‌గాంధీ ఏ మాత్రం వెనక్కి తగ్గేలేదు. మోదీ, అమిత్‌ షా, జ్ఞానేశ్ కుమార్‌తో విసిగిపోయిన ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనాలని అందులో ప్రస్తావించారు. పోలీసుల లాఠీ ఛార్జీలకు భయపడొద్దని, మాతో కలిసి రావాలన్నారు. వారి ఇలాంటి చేష్టలకు పాల్పడే దైర్యం బీజేపీకి ఉండదన్నారు. మాతో కలిసి కవాతుకు రండి.. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరం కలిసి నడుద్దామని అన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని, దేశ ఆత్మ కోసం చేసే యాత్రగా వర్ణించారు.

వ్యాపారుల సమస్యలు మాకు అర్థమవుతున్నాయని, మెట్రోలను ప్రభుత్వం మూసి వేసిందన్నారు. చివరకు రోడ్లను సైతం మూసి వేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని క్లోజ్ చేసి ఢిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచిందన్నారు. ఓట్లు చోరీ చేస్తే మీ షాపులు, పిల్లల భవిష్యత్తు ఏదీ సురక్షితంగా ఉండదని తేల్చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించాలని ప్రధాని మోదీతో చెప్పాలని, కేవలం అర నిమిషంలో నిరసనలు ఆగిపోతాయన్నారు. దేశంపై దాడి జరుగుతోందని, మీపై దాడి జరుగుతోందని, మీ భావ ప్రకటనా స్వేచ్ఛ, మీ ఆలోచనా విధానంపై దాడి జరుగుతోందని మీకు అనిపిస్తే ముందుకు వచ్చి మాతో చేరాలన్నారు.

Advertisement

ALSO READ: సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!

 

Related News

రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!

సూపర్ ఎల్ నినో ఎఫెక్ట్.. మార్చి నాటికి భారత్‌లో 55 వేల మరణాలు.. కలవరపెడుతున్న గణాంకాలు!

17 మంది ఖైదీల పరారీ ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ఆ రోజు జైల్లో ఏం జరిగిందంటే?

అర్ధరాత్రి అనుభవం.. క్యాబ్‌లో ఒంటరి ప్రయాణం, ముంబై యువతి ఇన్‌స్టా పోస్ట్

భర్తను వదిలి మరో వ్యక్తితో 10 ఏళ్లు సహజీవనం చేసిన భార్య.. భరణం కేసులో కోర్టు తీర్పు ఇదే

ఆరేళ్ల బాలుడికి జాక్‌పాట్.. ఏకంగా రూ.50 లక్షల కారు, అదెలా సాధ్యం?

భారతీయ పైలట్‌కు యూఏఈ అత్యున్నత అవార్డుతో సత్కారం.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×