E-Paper
Advertisement

లవర్‌తో తోటి ఉద్యోగి ఫ్రెండ్ షిప్.. కట్ చేస్తే దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

లవర్‌తో తోటి ఉద్యోగి ఫ్రెండ్ షిప్.. కట్ చేస్తే దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
Advertisement

Noida Murder: ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ మర్డర్ చోటుచేసుకుంది. తన లవర్ కు ఫ్రెండ్ షిప్ పేరుతో దగ్గరవుతున్నాడన్న అనుమానంతో తోటి ఉద్యోగిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడికి చికిత్స అందించిన అనంతరం నోయిడా పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే..

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి బరేలికి చెందిన సురేశ్ గా పోలీసులు తెలిపారు. నిందితుడు నరేశ్ ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. పోలీసుల కథనం ప్రకారం… గ్రేటర్ నోయిడాలోని సిర్సా సర్కిల్ వద్ద గురువారం (జులై 23) రాత్రి ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నట్లు 112 నెంబర్ కు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోగా.. అప్పటికే ఆ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ఆస్పత్రికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే సురేశ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Advertisement

దర్యాప్తులో షాకింగ్ నిజాలు

దీంతో హత్య కేసు కింద విచారణ ప్రారంభించిన నోయిడా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. గొడవపడ్డ నరేశ్, సురేశ్ ఇద్దరూ ఒకే ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అదే కంపెనీలో పనిచేస్తున్న బాబీ అనే మహిళ గత ఏడేళ్లుగా నరేశ్ తో ప్రేమలో ఉన్నట్లు నోయిడా అడిషనల్ డీసీపీ సంతోష్ కుమార్ తెలిపారు. అయితే బాబీ ఇటీవల సురేశ్ తో మాట్లాడటం ప్రారంభించిందని పేర్కొన్నారు. అయితే తమది స్నేహమని ఇద్దరూ చెప్పినా సురేశ్ నమ్మలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దని హెచ్చరించాడు. అయినప్పటికీ సురేశ్ వినకపోవడంతో నరేశ్ తీవ్ర అసహనానికి గురైనట్లు డీసీపీ స్పష్టం చేశారు.

Advertisement

Also Read: BSNL మరో దుమ్మురేపే ప్లాన్.. 700GB డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీ.. 6 నెలలు పండగే!

పదునైన ఆయుధంతో దాడి

ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి సిర్సా సర్కిల్ సమీపంలో నరేశ్, సురేశ్ ఇద్దరు కలుసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరూ మద్యం సేవించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతి విషయంలో వాగ్వాదం జరగ్గా.. పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు స్పష్టం చేశారు. వాగ్వాదం జరుగుతున్న క్రమంలో నరేశ్ పదునైన ఆయుధంతో సురేశ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. ఈ ఘటనలో నరేశ్ కూడా గాయపడినట్లు తెలిపారు. స్థానికులు ఇద్దరినీ అడ్డుకొని ఆస్పత్రికి తరలించగా.. తీవ్రగాయాలైన సురేశ్ చికిత్స పొందుతూ చనిపోయినట్లు చెప్పారు. దీంతో చికిత్స అనంతరం నరేశ్ ను అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ డీసీపీ వివరించారు.

Also Read: నీట్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Related News

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

ఢిల్లీ పీజీ హాస్టల్ భవనం ఘటన.. పెరుగుతున్న మృతులు, సీసీటీవీలో కీలక విషయాలు, శిథిలాల కింద ఇంకా

Big Stories

Advertisement
×