BRS MLCs: తెలంగాణ శాసన సభాపతి అయిన గడ్డం ప్రసాద్ కుమార్ పై తెలంగాణ అసెంబ్లీ ముందు దరుసుగా మాట్లాడినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలైన తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శాసన మండలి షెసన్స్ మొత్తానికి హజరుకాకుండా వీరిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సంఘటన రాజకీయంగా కలకలం రేపుతుంది.
స్పీకర్‌ను అవమాకరంగా బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి తీరుపై రోజంతా రచ్చ నడిచింది. అసెంబ్లీతో పాటు మండలిలోనూ పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ నేతల తీరును తప్పు పట్టారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి అవమానకర తీరుతో ప్రవర్తించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానం ప్రవేశపెట్టారు.
Also read: చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!
ఇది స్పీకర్‌కు మాత్రమే జరిగిన అవమానం కాదనీ, సభ మొత్తాన్ని అవమానించారన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇదంతా బీఆర్ఎస్ ఆలోచనా విధానం అన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యల కోసం దామోదర ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. అటు మండలిలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్మహించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరు సభ్యులపైనా సస్పెన్షన్ వేటు వేశారు. సెషన్ మొత్తానికి వారిపై వేటు వేసినట్టు ప్రకటించారు.
Also read: నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?