BigTV English

Congress party: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఈవీఎం వ్యత్యాసాల పరిశీలనకు కమిటీ!

Congress party: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఈవీఎం వ్యత్యాసాల  పరిశీలనకు కమిటీ!

Haryana elections congress party Investigate EVM complaints: హరియాణా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు విషయంలో పార్టీ అభ్యర్థుల ఫిర్యాదులు, ఈవీఎంలలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ విచారణ ముగిసే వరకు సీల్ చేసి భద్రపర్చాలని ఈసీని కోరారు.


ఇందులో భాగంగానే ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కొన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపింది. మొత్తం 20 సెగ్మెంట్ల ఫలితాలపై అనుమానం ఉందని సంబంధిత ఆధారాలను ఈసీకి సమర్పించామని తెలిపింది.

అయితే మరో 13 సెగ్మెంట్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొంది. ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నట్లు తెలిపింది.


Also Read: ఢిల్లీలో భారీగా డ్రగ్స్.. రూ.2 వేల కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

ఇందులో భాగంగానే మాజీ సీఎంలు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖేరాలతో కూడిన సీనియర్ నేతల బృందం, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ లు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు.

హర్యానా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత ఓట్లు లెక్కించగా కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఆ తర్వాత వెంటనే ఫలితాలు రివర్స్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ సంబరాలకు బ్రేక్ పడింది. ఒక్కసారిగా బీజేపీ ఫామ్ లోకి వచ్చి విజయ దిశగా పరుగులు పెట్టింది. దీంతో కాంగ్రెస్ నాయకులు షాక్ కుగ గురయ్యారు. ఓవరాల్ గా బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీజేపీ విజయాన్ని స్వాగతించమని ప్రకటించింది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×