చిత్రం : మార్టిన్
విడుదల తేది : 11 అక్టోబర్ 2024
నటీనటులు : ధృవ సర్జా, వైభవి శాండిల్య, అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్
దర్శకుడు : A.P. అర్జున్
నిర్మాత : ఉదయ్ కె. మెహతా
Martin Movie Rating – 1/5
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు ధృవ్ షార్జా. ఇతను నటించిన ‘పొగరు’ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.దాని కంటే ముందుగా ఇతను పలు సినిమాల్లో నటించాడు కానీ.. వాటిని తెలుగులో రిలీజ్ చేయలేదు. అతను హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందింది. అదే ‘మార్టిన్’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
అర్జున్(ధృవ్ షార్జా) ఓ పోర్ట్ లో చెక్ పోస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు.ఇతను చాలా సిన్సియర్. దేశభక్తి కూడా ఎక్కువ. కట్ చేస్తే.. ఇతను ఇస్లామాబాద్ వెళ్లి.. అక్కడ చాలా మందిని హతమార్చి.. పాకిస్తాన్ పోలీసులకి చిక్కుతాడు. ఇతని సామర్ధ్యం తెలుసుకుని..అక్కడి టెర్రరిస్ట్..లు ఇతనికి ఓ డ్రగ్ ఇస్తారు. దీంతో అతను గతం మర్చిపోతాడు. ఇంటర్వెల్ టైంకి ఇతను అర్జున్ అని తెలుసుకుంటాడు. కానీ ఇతను అర్జున్ కాదు మార్టిన్ అని తర్వాత తెలుస్తుంది. ఇతను ‘మార్టిన్’ అయితే.. మరి అర్జున్ ఎవరు? టెర్రరిజం, బ్లాక్ మనీ వంటి వాటితో ‘మార్టిన్’ కి లింక్ ఏంటి? మధ్యలో ప్రీతి(వైభవి శాండిల్య) ఎవరు? నావీ ఆఫీసర్ అశోక్ కుమార్(అచ్యుత్ కుమార్) తో ఇతనికి సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అంటే.. పెద్ద క్యాస్టింగ్, పెద్ద బడ్జెట్ అని మాత్రమే కొందరు ఫిలిం మేకర్స్ భావిస్తున్నట్టు ఉన్నారు. హై లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ ఎపిసోడ్స్.. వాటికి పీరియాడిక్ డ్రామా వంటి టాగ్స్ తగిలిస్తే చాలు అని వాళ్ళు భావిస్తున్నట్టు ఉన్నారు. అవన్నీ అపోహలు అని.. కంటెంట్ ప్రధానం అని వాళ్ళు గ్రహించడం లేదు. ‘మార్టిన్’ తో ఇది నిజమే అని మరోసారి ప్రూవ్ అయ్యింది. దర్శకుడు ఎ.పి. అర్జున్ అనుకున్న లైన్ బాగుంది.కానీ దాని చుట్టూ అల్లుకున్న క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆసక్తిని కలిగించే విధంగా లేకపోగా.. విసిగిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్క్రీన్ పై యాక్షన్ సీన్లు నాన్ స్టాప్ గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే హీరోతో సహా ఒక్కరి మొహంపై కూడా ఎక్కువసేపు క్లోజప్..లు ఉండవు. ‘కథ ఇది’ అని థియేటర్లో కూర్చుకున్న ప్రేక్షకుడికి ఓ అవహగాహన వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ అయిన వెంటనే.. ఓ ట్విస్ట్ వస్తుంది. అది ఆసక్తిని కలిగించే విధంగా లేకపోగా అందరినీ అయోమయానికి గురిచేస్తుంది. సినిమాటోగ్రాఫర్ కి ఈ సినిమా పెద్ద పనిష్మెంట్ అని చెప్పాలి. దర్శకుడు అతన్ని ఎంత కన్ఫ్యూజ్ చేశాడో.. స్క్రీన్ పై ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నా.. ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడం వల్ల ప్రేక్షకులకి అవి గొప్పగా అనిపించవు. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు పెద్ద గొప్పగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రవి బస్రుర్ తో కొట్టించారు. అది బాగుంది అని చెప్పేలా లేదు. చాలా లౌడ్ గా అనిపిస్తుంది. టెక్నికల్ టీం బాగా కష్టపడినా.. వాళ్ళ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది అని చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే.. ధృవ్ షార్జా లుక్స్ వైజ్ ఓకే. నటన గుర్తుపెట్టుకునే విధంగా అయితే ఇంపాక్ట్ చేయలేదు. హీరోయిన్ వైభవి లుక్స్ బాగానే ఉన్నా.. ఆమె లిప్ సింక్ సెట్ అవ్వలేదు. ఆమెకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. అన్వేషి జైన్, అచ్యుత్ వంటి వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.మిగిలిన నటీనటులు పాత్రలు పెద్దగా చెప్పుకునే విధంగా లేవు.
ప్లస్ పాయింట్స్ :
ప్రొడక్షన్ వాల్యూస్
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్ :
డైరెక్షన్
మ్యూజిక్
సెకండాఫ్
మొత్తంగా.. ‘మార్టిన్’ ఓ కన్ఫ్యూజన్ యాక్షన్ డ్రామా. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని సైతం ఇరిటేట్ చేసే విధంగా ఉంటుంది. సింపుల్ గా స్కిప్ కొట్టేయొచ్చు.
Martin Movie Rating – 1/5