BigTV English

Hemant Soren | ఝార్ఖండ్ సిఎం మిస్సింగ్.. భారీ నగదు, BMW కారు సీజ్ చేసిన ఈడీ!

Hemant Soren | ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సోమవారం ఢిల్లీలోని ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిలో తనిఖీలు చేసింది. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి కనిపించడం లేదు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ సమాచారం లేదు. ఈడీ అధికారులు ఆయన ఇంటి నుంచి 36 లక్షలు నగదు, ఒక బియండబ్యూ సీజ్ చేశారు.

హేమంత్ సొరెన్ ఢిల్లీ బంగ్లాలో ఈడీ అధికారులు 13 గంటలపాటు ఈ తనిఖీలు చేశారు. భూ కుంభకోణం కేసులో మనిలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వెళ్లారు. అయితే హేమంత్ సోరెన్ లేకపోవడంతో ఈ తనిఖీలు చేపట్టారు. జాతియా మీడియా కథనాల ప్రకారం.. ఈడీ అధికారులు బుధవారం ఝార్ఖండ్‌లోని సిఎం అధికారిక నివాసంపై కూడా తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.

జెఎంఎం పార్టీ సమావేశం
ఝార్ఖండ్ అధికార పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన అందరు ఎమెల్యేలు రాష్ట్రంలోనే ఉండాలని పార్టీ అగ్రనేతలు ఆదేశించారు. ఎమ్మెల్యేలందరూ మంగళవారం అత్యవసర సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధిష్టానం చెప్పింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.

భూకుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారుల పలుమార్లు సిఎం హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన హాజరు కాలేదు. ఇటీవలే రాష్ట్ర రాజధాని రాంచీలో ఈడీ అధికారులు ఆయనను ఈ కేసులో ప్రశ్నించారు. ఆ తరువాత జనవరి 29 లేదా జనవరి 30న మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పారు. కానీ హేమంత్ సోరెన్ ఢిల్లీ బయలుదేరినట్లు తెలియగానే ఈడీ అధికారులు కూడా ఢిల్లీ చేరుకొని ఆయన బంగ్లాలో తనిఖీలు చేశారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×