E-Paper
Advertisement

బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!

బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌ చేస్తూ ముగ్గురు కార్మికులు మృతి!
Advertisement

Bachupally Accident: హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పనిలో భాగంగా ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు తిరిగిరాని లోకాలకు చేరడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? కార్మికులు ఏ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ముగ్గురు కార్మికుల మృతిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు సుమన్ అలియాస్ షణ్ముఖ్ (24), సురేష్ 25), పవన్ (25) గా గుర్తించారు. వీరు శ్రీకాకుళం జిల్లాకు చెందని వారిగా గుర్తించారు. వీరు బొల్లారం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.  ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. హైడ్రా క్యూఆర్టీ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలకు సిద్ధమయ్యాయి. సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ సమయంలో కార్మికుల భద్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి.

Advertisement

Also Read: రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఏపీ సర్కార్ సీరియస్.. రంగంలోకి ఐజీ స్థాయి అధికారి!

Tags

Related News

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ దంపతులు!

మీ జిల్లాల్లో అసలు పరిస్థితి ఏమిటి.. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జి ‘వన్ టు వన్’ భేటీ!

విహారయాత్రలో విషాదం.. ఉయ్యాల తగిలి విద్యార్థి మృతి!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. సోదరుడిపైనా కేసు నమోదు!

తెలంగాణ ఇన్‌ఛార్జ్ సందీప్‌‌తో రాజగోపాల్‌-అనిరుధ్ భేటీ.. చర్యలు తప్పవు, పదవులు దూరం చేసుకోవద్దని సూచన

ఫ్రెండ్ యాప్‌లో పరిచయం..కోటీశ్వరుడినంటూ బిల్డప్.. మహిళ మంగళసూత్రం కాజేసిన మెకానిక్

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, రానున్న నాలుగు రోజులపాటు..

Big Stories

Advertisement
×