E-Paper
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ సంచలన వ్యూహం?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ సంచలన వ్యూహం?
Advertisement

Nagara Sabha: కృష్ణా జలాల అంశాన్ని మరోసారి రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రయోజనాలు, సాగునీటి హక్కుల పరిరక్షణ నినాదంతో ప్రజాక్షేత్రంలోకి దిగాలని భావిస్తోంది. ఇందుకోసం నల్లగొండను వేదికగా ఎంచుకుని భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. డిసెంబర్ 10న నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో లక్ష మందితో ‘నగారా సభ’ నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ, నీటి తరలింపు వివాదం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నల్లగొండ జిల్లాకు సాగునీటి కేటాయింపులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.

జల వివాదమే ప్రధాన అస్త్రం..

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడమే సభ ప్రధాన ఉద్దేశంగా బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా నీటి వినియోగం, తరలింపు జరుగుతున్నాయన్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సాగునీటి అవసరాలు, పెండింగ్ ప్రాజెక్టులు, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించనున్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు.

కేటీఆర్ ముఖ్య అతిధిగా..

Advertisement

అంతేగాకుండా పల్నాడ్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభించి 9 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పరస్పర విరుద్దంగా వ్యాఖ్యలు నేపథ్యంలో ఎండగట్టాలని గులాబీ భావిస్తుంది. ఈ సభలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని విమర్శనాస్త్రాలు సంధించనున్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్, కృష్ణా జలాల అక్రమ తరలింపు ఆరోపణలు, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా వంటి అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలకు జరుగుతున్న నష్టాన్ని గణాంకాలు, ప్రాజెక్టుల వివరాలతో ప్రజలకు వివరించాలనే ప్రణాళికలో పార్టీ ఉంది. గతంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వాటి పురోగతి, నిలిచిపోయిన పనులపై కూడా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలకు బాధ్యతలు

లక్ష మందితో సభ నిర్వహించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకత్వం క్షేత్రస్థాయిలో సమీకరణకు ప్రాధాన్యమిస్తోంది. ఉమ్మడి నల్లగొండజిల్లా నేతలకు జనసమీకరణ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభనిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సభకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మూడు జిల్లాల పార్టీ జిల్లా ఇన్ చార్జులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. గ్రామాలు, మండలాల వారీగా కార్యకర్తలు, ప్రజలను తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సభ విజయవంతం చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడంతోపాటు ప్రజల్లో రాజకీయంగా తిరిగి పట్టు సాధించాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

Advertisement

Also Read: మంచు తుఫానులో లవ్ బర్డ్స్… సడెన్‌గా తెలుగులో ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ కామెడీ

ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు

కేవలం కృష్ణా జలాల అంశానికే సభను పరిమితం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రధానంగా ఎత్తిచూపాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల పురోగతి తదితర అంశాలను ప్రస్తావించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో పోల్చుతూ ప్రజల్లో చర్చకు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వంపై విమర్శలతోపాటు తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు బీఆర్ఎస్ మాత్రమే పోరాడుతోందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

పాలమూరులోనూ సభకు యోచన?

నల్లగొండ సభతోపాటు మహబూబ్‌నగర్‌లోనూ మరో భారీ బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సాగునీటి అవసరాలు, కృష్ణా జలాల వినియోగం వంటి అంశాలపై ఆ ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సభ నిర్వహిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జల పోరాటంతో రాజకీయ సమీకరణలు!

రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్‌కు కృష్ణా జలాల అంశం కీలక రాజకీయ వేదికగా మారుతోంది. తెలంగాణ సాగునీటి హక్కులు, రైతుల ప్రయోజనాల పరిరక్షణ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నాయకత్వం భావిస్తోంది. నల్లగొండలో లక్ష మందితో సభ నిర్వహించాలన్న లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది? కృష్ణా జలాల అంశంపై కేటీఆర్ ఎలాంటి ఆరోపణలు, విమర్శలు చేస్తారు? ప్రభుత్వం వాటికి ఎలా స్పందిస్తుంది? అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. డిసెంబర్ 10న నల్లగొండ వేదికగా గులాబీ దళం నిర్వహించనున్న సభ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి జల వివాదాన్ని కేంద్రబిందువుగా మార్చే అవకాశముంది. మరోవైపు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులపై ఎలాంటి విమర్శనాస్త్రాలు సాధిస్తారనేది ఇప్పుడు రాజకీయ ఆసక్తి నెలకొంది.

Also Read: ఇందూరులో ఉన్నది అర్వింద్‌ బీజేపీ! ఇ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ..! ఎంపీతో ఎమ్మెల్యేల ఎడముఖం పెడముఖం!

Tags

Related News

ఇందూరులో ఉన్నది అర్వింద్‌ బీజేపీ! ఇ ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ..! ఎంపీతో ఎమ్మెల్యేల ఎడముఖం పెడముఖం!

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి వర్సెస్ ఎంపీ వార్.. నలుగురు నేతలు సస్పెండ్?

జీహెచ్ఎంసీలో జీఐఎస్ సర్వేకు బ్రేక్.. ఆ రూ. 22 కోట్లు ఏమైనట్టు?

దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత్’ ప్రచారం.. చేయబోయే కార్యక్రమాలివే?

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

Big Stories

Advertisement
×