E-Paper
Advertisement

పెళ్లి, సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు.. డెలివరీ బాయ్ పనే ముద్దు.. ‘జెన్ జీ’ యువత నయా ట్రెండ్!

పెళ్లి, సాఫ్ట్ వేర్ జాబ్ వద్దు.. డెలివరీ బాయ్ పనే ముద్దు.. ‘జెన్ జీ’ యువత నయా ట్రెండ్!
Advertisement

Gen Z Jobs: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచన విధానం కూడా మారుతోంది. ఒకప్పుడు చదువు అయిపోగానే.. మంచి ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చేసిన విద్యార్థులు భావించే వారు. అయితే ప్రస్తుత జెన్ జీ యువత ఆలోచన విధానం ఇందుకు భిన్నంగా ఉంటోంది. నిరుద్యోగం, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో అస్థిరత, వైవాహిత జీవితంపై అనాసక్తి వంటి కారణాలతో వారు విభిన్న ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. డెలివరీ బాయ్స్ పనిచేస్తూ రూ.వేలల్లో సంపాదిస్తున్నారు.

జెప్టో, బ్లింకిట్ వైపు మెుగ్గు

వైట్ కాలర్ ఉద్యోగాలం కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృథా చేయకుండా.. బీటెక్ చేసిన వారు జెప్టో (Zepto), బ్లింకిట్ (Blinkit), అమెజాన్, ఇన్‌స్టామార్ట్, స్విగ్గీ వంటి సంస్థల్లో డ్రైవింగ్, ఫుడ్ డెలివరీ, క్విక్-కామర్స్ వంటి పనుల వైపు అడుగులు వేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి మహానగరాల్లో కొందరు నెలకు రూ. 35,000 నుంచి రూ. 40,000 లేదా అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. జీతం నెలంతా గంటలకొద్ది ఆఫీసులు గడిపే బదులు.. నచ్చిన టైంలో డెలివరీలు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

సాఫ్ట్ వేర్ జీతాలతో పోలిక..

Advertisement

హైదరాబాద్‌లో ఫ్రెషర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు సాధారణంగా నెలకు సుమారు రూ. 33,000 నుంచి రూ. 67,000 వరకు లభిస్తోంది. బెంగళూరులో ఇది దాదాపు రూ. 42,000 నుంచి రూ. 83,000 మధ్య ఉంటోంది. అనుభవం పెరిగేకొద్దీ జీతాలు భారీగానే పెరుగుతాయి. అయితే పోటీ, నియామకాల్లో జాప్యం, లేఆఫ్‌లు, పని ఒత్తిడి వంటి కారణాల వల్ల సాఫ్ట్‌వేర్ కెరీర్‌లో మునుపటి స్థిరత్వం లోపిస్తోంది. దీంతో గతంలో సాఫ్ట్ వేర్ గా పనిచేసి లేఆఫ్ లో ఉద్యోగం కోల్పోయిన వారు సైతం గిగ్ వర్కర్లుగా మారుతున్న పరిస్థితులు సమాజంలో కనిపిస్తున్నాయి.

‘ఈ పని బాగా నచ్చింది’

బీటెక్ చదివి డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఓ యువకుడు.. అందుకు గల కారణాలను వెల్లడించాడు. ‘నేను బీటెక్ చదివాను. కానీ ఇప్పుడు డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 40,000 సంపాదిస్తున్నాను. ఈ పని నాకు నచ్చింది’ అని తెలిపాడు. బీటెక్ చేసి సాఫ్ట్‌వేర్ రంగం వైపు ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నకు ప్రస్తుతం ఆ రంగం అస్థిరత్వంతో ఉంది. ఏఐ ప్రభావంతో ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అర్థం కానీ పరిస్థితి ఉంది. దాని కన్నా డెలివరీ బాయ్ గా పనిచేసుకోవడమే బెటర్’ అంటూ సమాధానం ఇచ్చాడు. మరి పెళ్లి చేసుకొని సెటిల్ కావడానిక డెలివరీ బాయ్ గా వచ్చే డబ్బు సరిపోతుందా అన్న ప్రశ్నకు అసలు తాను పెళ్లే చేసుకోనని అతడు సమాధానం ఇచ్చాడు. ఇది జెన్ జీ తరం ఆలోచనల్లో వస్తున్న మార్పును ప్రతిబింబిస్తోంది.

Advertisement

Also Read: బంగారం ధరలు ఢమాల్.. రూ.లక్షకు పడిపోయే ఛాన్స్.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?

ఐటీ జాబ్ To డెలివరీ బాయ్

మరోవైపు రజనీష్ అనే యువకుడు గతంలో ఐటీ జాబ్ చేసి ప్రస్తుతం డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. గతంలో ఒక చిన్న ప్రైవేటు సంస్థలో నెలకు రూ.50 వేల జీతానికి అతడు పనిచేశాడు. లేఆఫ్స్ కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయి.. డెలివరీ బాయ్ గా మారాడు. ‘నేను రోజుకు ఆరు గంటలు డెలివరీ బాయ్‌గా పనిచేసి సుమారు రూ. 35,000 సంపాదిస్తున్నాను. నాకు ఇది చాలు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో రూ. లక్ష సంపాదించి ఏదో కారణంతో అది పోతే తట్టుకోలేం. అదే జీతంతో మరో ఉద్యోగం దొరకడం కష్టం’ అని రజనీష్ వివరించాడు.

Also Read: ఓపెన్‌ఏఐ సంచలన ప్రకటన.. ఏడాది పాటు ‘చాట్‌జీపీటీ ప్లస్’ ఫ్రీ.. రూ.23,998 విలువైన సేవలు ఉచితం!

Tags

Related News

బంగారం ధరలు ఢమాల్.. రూ.లక్షకు పడిపోయే ఛాన్స్.. మరి ఇప్పుడే కొనాలా? ఇంకాస్త ఆగాలా?

పెట్టుబడుల్లో మహిళల జోరు.. మ్యూచువల్ ఫండ్స్‌, ఈక్విటీల్లో పెరుగుతున్న వాటా

బ్యాంకులో ఆ విషయం చెబితే చాలు.. పొదుపు ఖాతాపై మూడు రెట్ల వడ్డీ, అదెలా సాధ్యం?

టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ, ట్రంప్‌కు కాసుల పంట

10 ఏళ్లలోనే కోటీశ్వరులు కావాలంటే ఇలా చేయండి… ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?

బ్యాంకు FDలకు గుడ్ బై చెప్పండి.. నెలకు 3,000 SIPతో 40 లక్షలు అయ్యే ఫినాన్స్ మంత్ర

PPF vs SIP vs SSY… 3000లతో 15 లక్షల సంపాదన… పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ?

Big Stories

Advertisement
×