BigTV English

Sanjay Gandhi Nasbandi Campaign: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ ఎలా నాయకత్వం వహించారు..?

Sanjay Gandhi Nasbandi Campaign: ఎమర్జెన్సీ నాటి ‘నస్బందీ’ ప్రచారానికి సంజయ్ గాంధీ  ఎలా నాయకత్వం వహించారు..?

Sanjay Gandhi Nasbandi Campaign: చాలా మంది భారతీయ మేధావులు దేశంలో పెరుగుతున్న జనాభా పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే పెరుగుతున్న జనాభా దేశ ఆర్థాకాభివృద్ధిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. సరిగ్గా 49 ఏళ్ల క్రితం జూన్ 24-25 అర్ధరాత్రి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 21 నెలల్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భారతదేశాన్ని నియంతృత్వ పాలన కొనసాగించారని విమర్శిస్తుంటారు. ఆ సమయంలో అనేక మితిమీరిన చర్యలలో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ చేత సామూహిక బలవంతంగా స్టెరిలైజేషన్ ప్రచారం జరిగిందని ప్రచారం ఉంది.


1951వ సంవత్సరంలో భారతదేశంలో సుమారు జనాభా 361 మిలియన్లు ఉందని, ఇది ప్రతీ ఏటా 5,00,000 మేర పెరుగుతుందని ఏస్ డెమోగ్రాఫర్ ఆర్ఏ గోపాలస్వామి అంచనా వేశారు. ఈ జనాభా రేటు ప్రకారం మిలియన్ల దిగుమతులు జరుగుతున్నా కూడా దేశం ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుందని అన్నారు. అయితే 1975 ఎమర్జెన్సీ యుగంలో, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పౌర స్వేచ్ఛను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సంజయ్ గాంధీ పేదరికాన్ని అంతం చేయాలనే ఉద్ధేశ్యంతో “భీకరమైన ప్రచారం” అని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో దాదాపు 6.2 మిలియన్ల పురుషులకు స్టెరిలైజేషన్ నిర్వహించారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 1952లో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో స్టెరిలైజ్ చేయించుకోవడానికి అవగాహన ప్రచారాలు, ప్రోత్సాహకాలు కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇది ప్రమాదకరమైనదని భావించారు. ఈ సమయంలోనే నస్బందీ అనే పేరుతో స్టెరిలైజేషన్ ను అడ్డుకునేందుకు వేల మంది ప్రజలు నిరసనలు తెలిపారు.


Also Read: Pathankot high alert: పఠాన్‌కోట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ, పోలీసులు హై అలర్ట్

1972లో వర్షాలు లేకపోవడం, ఆ తర్వాత 1973లో ఆహార సంక్షోభం ఏర్పడడంతో జనాభా నియంత్రణ అనేది సవాలుగా మారింది. ఆ సమయంలో సంజయ్ గాంధీకి ఎటువంటి అధికారిక పదవి లేకపోయినా కూడా ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. ఏది ఏమైనప్పటికీ, 1977లో ఇందిరాగాంధీ ఓటమిలో నస్బందీ ప్రచారం కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో, కాంగ్రెస్ ఓట్ షేర్ బాగా పడిపోయింది. దీనికి విరుద్ధంగా, దక్షిణాది రాష్ట్రాలలో మెరుగ్గా పనిచేసింది.

Tags

Related News

Delhi Terrorists Arrested: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: వంతెన మీద మేకులు.. వందలాది వాహనాలు పంక్చర్.. ఈ కుట్రకు కారకులెవరు?

Big Stories

×