BigTV English

Pathankot High Alert: పఠాన్‌కోట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ.. పోలీసులు హై అలర్ట్..!

Pathankot High Alert: పఠాన్‌కోట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ఎంట్రీ.. పోలీసులు హై అలర్ట్..!

High Alert in Pathankot due to Pakistani Terrorists entered: పంజాబ్-జమ్మూకాశ్మీర్‌ సరిహద్దులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్‌ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లిద్దరు పఠాన్‌కోట్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో పంజాబ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై పోలీసులు మొహరించారు. అంతేకాదు వాహనాలను క్షుణ్ణంగా తనికీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు.


భారత వాయుసేనకు కీలక స్థావరం పఠాన్‌కోట్. ఎనిమిదేళ్ల కిందట ఈ స్థావరంపై ఉగ్రవాదులు విరుచుకు పడ్డారు. వీధుల్లో తిరుగుతూ వాహనాలను హైజాక్ చేసి ఎయిర్‌ఫోర్స్ స్థావరంలోకి ప్రవేశించారు. ఈ ఘటన లో భారీగా డ్యామేజ్ జరిగింది. ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు అధికారులు భారీగా బలగాలను మొహరించారు.

ఇండియా- పాకిస్థాన్ బోర్డర్ ప్రాంతంలోని ఓ గ్రామం నుంచి పఠాన్‌కోట్ పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆయుధాలు ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు తన ఫామ్‌హౌస్‌కి వచ్చి భోజనం పెట్టాలని తుపాకీతో గురిపెట్టారని కాల్ చేసిన వ్యక్తి సమాచారం ఇచ్చాడు. పఠాన్‌కోట్ ప్రాంతం జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాతో సరిహద్దు కలిగివుంది. అంతేకాదు ఈనెల 12న అక్రమంగా చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. దీంతో అప్పటినుంచి పోలీసులు హై అలర్ట్‌గా ఉన్నారు.


Also Read: ఇద్దరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయలేదు.. అమృత్‌పాల్‌, రషీద్ మాటేంటి?

పఠాన్‌కోట్‌లో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు బలగాలు గుర్తించాయి. దీంతో రాత్రివేళ కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు పోలీసు అధికారులు. బీఎస్ఎఫ్‌తోపాటు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశారు. జూన్ 15 నుంచి పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎందుకంటే జూన్ 29న అమర్‌నాథ్ యాత్రికులు లఖన్‌పూర్ నుంచి జమ్మూకాశ్మీర్‌లోకి ప్రవేశించనున్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో యాత్రికుల కోసం కమ్యూనిటీ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి డజన్ల కొద్దీ వాహనాలు వస్తున్నాయి. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు.

Tags

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×