BigTV English

How To Check Voter Card Status: మీ ఓటర్ ఐడీ స్టేటస్ ను ఆన్ లైన్/ఆఫ్‌లైన్ లో ఎలా చెక్ చేయాలో తెలుసా..?

How To Check Voter Card Status: మీ ఓటర్ ఐడీ స్టేటస్ ను ఆన్ లైన్/ఆఫ్‌లైన్ లో ఎలా చెక్ చేయాలో తెలుసా..?

How To Check Voter Card StatusHow To Check Voter Card Status ( current news from India) : 2024 లోక్ సభ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఓటు హక్కును కల్పించింది. దీని కోసం చాలా మంది ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటారు. మరికొంత మంది తమ ఓటర్ ఐడీలో ఏమైనా తప్పులుంటే సంబంధింత పత్రాలను సమర్పించి మార్పుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు మీ ఓటర్ ఐడీ స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు మీ ఓటర్ ఐడీ స్టేటస్ ను ఆన్ లైన్/ఆఫ్‌లైన్ లో కింద తెలిపిన విధంగా సులభంగా తెలుసుకోవచ్చు.


కింద తెలిపిన విధంగా చేస్తే మీ ఓటర్ ఐడీ స్టేటస్ ను ఆన్‌లైన్ మోడ్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు..
1. మొదటిగా మీరు మీ ఫోన్, పీసీలో https://voters.eci.gov.in/ లేదా https://www.nvsp.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
2. ఆ తర్వాత ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయాలి.
3. అక్కడ కనిపించే ఆప్షన్ మీరు అప్లై చేసినప్పుడు మీకు వచ్చిన ప్రింట్ అవుట్ పై ఉన్న నెంబర్ లేదా ఫోన్ కు వచ్చిన రిపరెన్స్ నెంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
4. దీన్ని ఎంటర్ చేయగానే మీకు మీ అప్లికేషన్ స్టేటన్ కనిపిస్తుంది.
5. సాధారణంగా ఏ అప్లికేషను కైనా నాలుగు స్టేటస్ లు ఉంటాయి. అవి సబ్మిటేడ్, BLO అప్పాయింటేడ్, ఫీల్డ్ వెరిఫైడ్, యాక్సెప్ట్/రిజేక్టేడ్ అనే నాలుగు రకాల స్టేటస్ లు మీకు కనిపిస్తాయి. ఈ నాలుగు ప్రక్రియలలో ఏ ప్రక్రియ పూర్తి అయితే ఈ ప్రక్రియలు హైలెట్ చేసి కనపడతాయి.
6. మీరు ఆన్ లైన్లో అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది. ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకున్నవారికి ప్రస్తుతం ఈ డేటా అందుబాటులో లేదు.

ఆఫ్‌లైన్ మోడ్ లో మీ ఓటర్ ఐడీ స్టేటస్ చెక్ చేసుకోవటడం ఎలానో ఇప్పుడు తెలుసుకోండి..
1. ప్రతి నియోజకవర్గానికి దగ్గర్లో ఉన్న ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లాలి.
2. మీరు మీతోపాటుగా తప్పనిసరిగా ఓటరు పేరు, ప్రస్తుత చిరునామా, అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వంటి విషయాలు అక్కడ ఉన్న అధికారులకు అందించాలి.
3. అప్పుడు వారు తమ దగ్గర ఉన్న డేటా ప్రకారం మీకు మీ ఓటర్ ఐసీ స్టేటస్ ను తెలియజేస్తారు.


Also Read: PM Modi Nagarkurnool Sabha : తెలంగాణ గేట్ వే ఆఫ్ సౌత్.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే : ప్రధాని మోదీ

SMS ద్వారా ఓటర్ ఐడీ స్టేటస్ తెలుసుకోవచ్చా..?
ప్రస్తుతానికి దేశంలో SMS ద్వారా ఓటర్ ఐడీ స్టేటస్ తెలుసుకునే వీలు లేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే SMS ద్వారా ఓటర్ ఐడీ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. అది కూడా మీ పేరు ఓటర్ లిస్టు లో ఉందొ లేదో అన్న విషయం మాత్రమే తెలుస్తుంది.

Tags

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×