BigTV English

India Vs Pakistan War : హిందువులు, ఆలయాలే టార్గెట్.. పహల్గాం ఉగ్రవాదుల్లానే పాకిస్తాన్

India Vs Pakistan War : హిందువులు, ఆలయాలే టార్గెట్.. పహల్గాం ఉగ్రవాదుల్లానే పాకిస్తాన్

India Vs Pakistan War : ఉగ్రవాదులు మతం ప్రాతిపదికనే మారణహోమానికి పాల్పడ్డారు. పహల్గాంలో హిందువులను ఎంచుకొని మరీ కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ చేపట్టింది ఇండియా. పాకిస్తాన్ సైతం రివేంజ్ అటాక్స్ చేస్తోంది. అయితే, ఉగ్రవాదుల మాదిరే.. పాక్ కూడా మత ప్రాతిపదికనే దాడులు చేస్తోంది. హిందువులు, హిందూ ఆలయాలే టార్గెట్‌గా డ్రోన్లను ప్రయోగిస్తోంది. మిస్సైల్స్‌ను వదులుతోంది. ఇండియాలో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా సిక్కులు, గురుద్వారాలపై బాంబులు వర్షం కురిపిస్తోంది. ఇక జమ్మూ కశ్మీర్‌లోనైతే దాడుల్లోనూ మతోన్మాదం ప్రదర్శిస్తోంది పాకిస్తాన్.


జమ్మూపైనే అటాక్స్ అందుకేనా?

జమ్మూలో హిందువుల సంఖ్య ఎక్కువ. కశ్మీర్‌ ప్రాంతంలో 90 శాతం ముస్లింలే నివసిస్తుంటారు. గడిచిన రెండు రోజులుగా కశ్మీర్ ఏరియాలో కంటే కూడా.. జమ్మూలోనే ఎక్కువ బాంబింగ్‌కు ట్రై చేస్తోంది పాపిస్తాన్. హిందువులకు పరమ పవిత్రమైన, ప్రసిద్ద వైష్ణో దేవి ఆలయంపై వరుసగా అటాక్ చేసింది. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుండటంతో ప్రమాదం తప్పింది. అయితే, శంభూ దేవాలయంపై మాత్రం పాక్ దాడిలో దెబ్బతింది. అంటే, ఉగ్రవాదులు ఎలాగైతే హిందువులో కాదో కన్ఫామ్ చేసుకొని, ఐడీ కార్డులు చూసి, కల్మా చదవమని మరీ 25 మందిని పహల్గాంలో కాల్చి చంపారో.. సేమ్ టు సేమ్ పాకిస్తాన్ ఆర్మీ సైతం అలానే హిందువుల ఆలయాలు, వాళ్లు ఉండే ప్రాంతాలపైనే దాడులు చేస్తుండటం దారుణం. అటు టెర్రరిస్టు్లు, ఇటు పాకీలు.. అంతా హిందూ వ్యతిరేక ఉన్మాదం ప్రదర్శిస్తూ ఘాతుకాలకు తెగబడుతున్నారు. జమ్మూలో పాక్ ఆటలు సాగకపోవడంతో.. ఇక తప్పదన్నట్టు శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై విరుచుకుపడింది. 5 బాంబులను పేల్చడంలో సక్సెస్ అయింది.


పంజాబ్‌లో గురుద్వారాలే టార్గెట్

అటు, పంజాబ్ విషయంలోనూ ఇదే గేమ్ ప్లే చేస్తోంది. ఇప్పటికే ఖలిస్తాన్ సిక్కు వేర్పాటువాదులు పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఇదే సాకుగా చేసుకుని.. ఇండియాలో హిందూ, సిక్కు చిచ్చు పెట్టేలా.. పంజాబ్‌లోని గురుద్వారాలను ధ్వంసం చేయాలని పెద్ద సంఖ్యలో డ్రోన్లను పంపుతోంది. పాక్ పంపే డ్రోన్లలో అధిక భాగం.. సైనిక స్థావరాలను కంటే కూడా గురుద్వారాలనే టార్గెట్ చేసుకున్నాయి. గురుద్వారాను పేల్చేసి.. భారత్ వల్లే తమ మత కేంద్రాలు ధ్వంసం అయ్యాయని సిక్కులు భావించేలా చేసి.. హిందువుల పైకి రెచ్చగొట్టేలా చేయాలనేది పాక్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, పంజాబ్‌లోనూ పాక్ ఎత్తుగడ పారలేదు. ఒక్క గురుద్వారా కూడా డ్యామేజ్ కాకుండా ఇండియన్ ఆర్మీ పాక్ డ్రోన్లను కూల్చేసింది. రాజస్థాన్‌లో సైతం సరిహద్దు సమీప గ్రామాలు, పాఠశాలలు, ఆలయాలు, సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తోంది పాక్. యుద్ధం చేయాలంటే మన ఆర్మీని ఢీ కొట్టాలి కానీ.. ఇలా జనాలపై బాంబులు, కాల్పులు జరిపితే అది యుద్ధమా? ఉగ్రవాదమా? ఉన్మాదమా? పాపిష్టి పాపిస్తాన్‌కే తెలియాలి.

యుద్దంలోనూ మతోన్మాదం..

పహల్గాం ఉగ్రమూకల వెనుక పాకిస్తాన్ ఉందనే వాదనకు ఈ ఘటనలు మరింత బలం చేకూర్చుతున్నాయి. హిందువులనే చంపాలంటూ టెర్రరిస్టులకు ఆదేశాలు ఇచ్చి మరీ బైసరన్‌లో నరమేధం సృష్టించారు. అదే పాక్ ఇప్పుడు తాను అఫీషియల్‌గా చేస్తున్న యుద్ధంలోనూ మళ్లీ హిందువులు, సిక్కులనే టార్గెట్ చేయడం.. ఇందులోని మతకోణాన్ని ప్రముఖంగా వెల్లడిస్తోందని అంటున్నారు. అందుకే, ఉగ్రవాదం నశించాలన్నా.. మతోన్మాదం ఆగాలన్నా.. పాకిస్తాన్‌ను తుడిచిపెట్టాల్సిందే. ఎలాగూ యుద్ధం స్టార్ట్ చేసేశారు కాబట్టి.. ఇక పాక్‌తో తాడోపేడో తేల్చేస్తేనే బెటర్.. దాయాది దేశాన్ని నామరూపాలు లేకుండా, ఫ్యూచర్‌లో మళ్లీ భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చావుదెబ్బ కొట్టాల్సిందే.. అనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌కు, ఇండియన్ ఆర్మీకి, ప్రధాని మోదీకి.. దేశంలోని అన్నివర్గాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. భారతీయ ముస్లింలు సైతం పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ.. పాక్‌ను ఖతం చేయాలంటూ నినదిస్తున్నారు.

Also Read : అణ్వాయుధాల ప్రయోగం అంత ఈజీనా? పాక్‌కు అంత ధైర్యం ఉందా?

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×