BigTV English

Nuclear weapon: అణ్వాయుధాల ప్రయోగం అంత ఈజీనా? ఆ దాడిని ఇండియా ఎదుర్కోగలదా?

Nuclear weapon: అణ్వాయుధాల ప్రయోగం అంత ఈజీనా? ఆ దాడిని ఇండియా ఎదుర్కోగలదా?

రష్యా – ఉక్రెయిన్ వార్ అయినా, పాకిస్తాన్ – భారత్ యుద్ధమైనా.. క్షిపణి దాడులు, బాంబుల మోతలు కామన్. ఇలా ఎంతకాలం..? క్షిపణులు ప్రయోగించి శత్రు దేశానికి ఎలాంటి సందేశం ఇస్తారు. ఈ క్షిపణులకు భయపడి శత్రువులు వెక్కి తగ్గితే ఓకే, లేకపోతే పరిస్థితి ఏంటి..? అటు ఇటు క్షిపణి ప్రయోగాలతో అసలు ఏం జరుగుతుంది. ఆధునిక యుద్ధాలకు ముగింపు అణు బాంబు లేదా అణ్వాయుధం. ఈ అణ్వాయుధాలను ప్రయోగిస్తే విజేత ఎవరో తేలిపోతుంది. అయితే అణ్వాయుధాలు చాలా దేశాల వద్ద ఉన్నాయి. ఒకరిపై ఒకరు వాటిని ప్రయోగించుకుంటే రెండు దేశాలు సమూలంగా నాశనమైపోతాయి. ఆర్థిక వ్యవస్థలే కాదు, అసలు వ్యవస్థలే లేకుండా పోతాయి. జీవరాశి అంతరించిపోతుంది. ఆయా ప్రాంతాలు కనీసం జీవనానికి కూడా పనికిరాకుండా పోతాయి. అంతటి ప్రమాదం కాబట్టే అణ్వాయుధాన్ని ఆఖరి ఆయుధంగా వాడతారు. మరి పాకిస్తాన్ హెచ్చరికల్ని ఎలా చూడాలి. అంత దూరం వస్తే అణ్వాయుధాల్ని బయటకు తీసేందుకు పాపిస్తాన్ రెడీగా ఉందనే వార్తలు వినపడుతున్నాయి. ఇందులో నిజమెంత..?


స్విచ్ నొక్కినంత ఈజీ కాదు..
రివాల్వర్ బటన్ నొక్కితే తుపాకి గుండు బయటకు పోయి లక్ష్యాన్ని తాకుతుంది. క్షిపణులను యుద్ద విమానాలనుంచి బయటకు వదిలేందుకు కూడా ఒక్క స్విచ్ చాలు. కానీ అణ్వాయుధం అలా కాదు. అది మన దగ్గర ఉన్నంత మాత్రాన దాన్ని ఎప్పుడుపడితే అప్పుడు ప్రయోగించలేం. ప్రస్తుతం పాక్ పరిస్థితి కూడా అంతే. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, అణ్వాయుధాలతో విరుచుకుపడతామని అంటున్నా నిజంగా ఆ పని చేయడం అంత సులభం కాదు.

ఏం..? ఎందుకు..?
పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ కి, న్యూక్లియర్ వెపన్ ని అసెంబుల్ చేసే మిసైల్ కాంప్లెక్స్ కి మధ్య 800 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ వెపన్ ని అసెంబుల్ చేసి, అక్కడ్నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంచ్ ప్యాడ్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వెపన్ ని ప్రయోగించగలదు. ఇదంతా జరిగేందుకు కొన్నిరోజుల సమయం పడుతుందని, ఆలోగా పాక్ ప్రయత్నాలను శాటిలైట్స్ ద్వారా ప్రపంచ దేశాలు పసిగడితే మాత్రం పాపం పండినట్టేనని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంటే న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తామంటూ పాకిస్తాన్ హెచ్చరించినంత సులభం కాదు, దాన్ని ప్రయోగించడం. ఆ విషయం తెలిసే పాక్ వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ప్రయోగించడానికి రెడీగా ఉన్న అణ్వాయుధాలు లేవు. అది కూడా పాక్ భయానికి మరో కారణం.


నిబంధనలు ఏంటి..?
అసలు పాకిస్తాన్ కే కాదు, ఆ మాటకొస్తే ఏ దేశానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడం అంత సులభం కాదు. అణ్వాయుధాలు ప్రయోగించాలంటే దేశంలో అత్యున్నత స్థాయి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రధాని బాధ్యత వహిస్తూ సంతకం చేయాలి. ఫైన్ గా దేశ రక్షణ వ్యవహారాల్లో ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ కోడ్ ని ప్రధాని స్థాయి వ్యక్తి బహిర్గతం చేయగలిగితేనే అణ్వాయుధం ప్రయోగించడానికి వీలవుతుంది.

అది పాపిస్తాన్ కదా..?
నిబంధనలు ఉన్నాయి సరే, వాటిని పాకిస్తాన్ పాటిస్తుందా అనేది ప్రశ్నార్థకం. నియమాలు పాటించే మంచి బుద్ధే ఉంటే అసలు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలకు శిక్షణ ఇస్తుందా, వారిని భారత్ పైకి ఎగదోస్తుందా..? పాకిస్తాన్ తప్పుడు బుద్ధి మనకు తెలుసు కాబట్టి.. నిబంధనలేవీ పాటించకుండానే ఆ దేశం అణ్వాయుధాల్ని ప్రయోగించే అవకాశం ఉంది.

భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన ఆకాంక్ష పాకిస్తాన్ కి ఉన్నా కూడా అది అంత సులభం కాదు. ఎక్కడ ఏ దేశం అణ్వస్త్రాన్ని ప్రయోగించినా దాదాపుగా అది ప్రపంచానికి ముప్పుగానే పరిగణించాలి. యుద్ధం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాదు, ఒకరిపై ఒకరు న్యూక్లియర్ బాంబులు వేసుకుంటే మిగతా దేశాలు కూడా మట్టికొట్టుకుపోతాయి. మరి వాటి సంగతేంటి..? తమకి అన్యాయం జరుగుతుందని తెలిసి ఆయా దేశాలు ఊరుకుంటాయా..? వారు కూడా రంగంలోకిి దిగితే అణ్వస్త్రం ప్రయోగించిన తొలి దేశం ప్రథమ ముద్దాయి అవుతుంది. ఆ వినాశనానికి కారణం వారే అవుతారు. అందుకే పాక్ భయపడుతోంద. ప్రపంచ దేశాలు తనని ఎక్కడ ఒంటరిగా మార్చేస్తాయోననే అనుమానం వారికి ఉంది.

పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం మూడు రకాల అణ్వాయుధాలున్నాయని తెలుస్తోంది. నాస్ర్ పేరుతో పిలిచే అణ్వాయుధం స్వల్ప శ్రేణి రకానికి చెందింది. ఇది 70 నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు. దీని సామర్థ్యం 0.5 నుంచి 5 కిలోటన్నుల మధ్యలో ఉంటుంది. ఒకరకంగా ఇది చాలా స్వల్ప శ్రేణి అణుబాంబ్. హిరోషిమాపై వేసిన బాంబ్ 15 కిలో టన్నుల సామర్థ్యం కలది. పాక్ వద్ద షాహీన్ అనే మధ్యశ్రేణి అణ్వాయుధం కూడా ఉంది. దాని పరిధి 2వేల కిలోమీటర్లు. పాక్ నుంచి ప్రయోగిస్తే నేరుగా ఢిల్లీ లేదా ముంబైపై అటాక్ జరుగుతుంది. ఇక షాహీన్-3 అనే దీర్ఘశ్రేణి అణ్వాయుధాలు కూడా పాక్ వద్ద ఉన్నాయి. వీటి పరిధి 2750 కిలోమీటర్లు. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లగల F-16, లేదా బాబర్ వంటి యుద్ధ విమానాల సామర్థ్యం పాకిస్తాన్ కు తక్కువ. దీంతో ఆ దేశం అణ్వాయుధాల ప్రయోగానికి సాహసించదనే చెప్పాలి.

ఇక అణ్వాయుధాల విషయంలో ప్రపంచ దేశాలు కొన్ని నియమాలు పెట్టుకున్నాయి. ఫస్ట్ యూజ్ పాలసీ, నో ఫస్ట్ యూజ్ పాలసీ వంటి నిబంధనలున్నాయి. ఎవరైనా తమపై అణ్వాయుధంతో దాడికి వస్తే ఆ తర్వాతే తాము దాడికి దిగుతామనే నిబంధన ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఇలాంటి నిబంధనలపై సంతకాలు చేయలేదు. అంటే శత్రువులు తమపై యుద్ధానికి వచ్చి తమను నాశనం చేస్తారని ఆ దేశం భయపడితే, అణ్వస్త్రాన్ని బయటకు తీసే వెసులుబాటు ఉంది. అంటే భారత్ నేరుగా అణ్వస్త్రాన్ని ప్రయోగించకపోయినా, ముందుగా పాక్ అణుదాడికి సిద్ధపడొచ్చు.

మన సామర్థ్యం ఏంటి..?
అణ్వాయుధాలను ప్రయోగిస్తే వాటిని తిప్పికొట్టే సామర్థ్యం భారత్ కి ఉంది కానీ, స్వల్పశ్రేణి రకాలను మాత్రం నియంత్రించడం కాస్త కష్టం. దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగాలను రాడార్ల ద్వారా పసిగట్టి ఆకాశంలోనే వాటిని అరికట్టగలం. కాని స్వల్పశ్రేణి విషయంలో సమయం సరిపోదు. ఏది ఏమైనా మన రక్షణ వ్యవస్థ అన్నిటికీ సిద్ధపడి ఉంది. పాకిస్తాన్ అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే.. మనదేశానికి ఎంత నష్టం జరుగుతుందో.. అంతకు పదిరెట్లు ఆ దేశానికి నరకం కనపడుతుందనేది నిజం. అందుకే పాక్ అణ్వస్త్రాల పేరుతో భయపెడుతోంది కానీ, వాటిని బయటకు తీసే సాహసం చేయట్లేదు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×