Singer Saketh..సింగర్ సాకేత్ (Singer Saketh).. ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సంగీతం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక టాక్ షో కి గెస్ట్ గా వచ్చిన ఈయన అందులో కొంతమంది సింగర్స్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
సిధ్ శ్రీ రామ్ పై సాకేత్ కామెంట్స్..
సింగర్ సాకేత్ తాజాగా తోటి సింగర్ పర్ణిక (Parnika)తో కలిసి తేజస్విని గౌడ(Tejaswini Gowda) హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాకమ్మ కథలు సీజన్ 2′ కార్యక్రమానికి గెస్ట్ లుగా విచ్చేశారు. పూర్తి ఎపిసోడ్ వైరల్ అవ్వడంతో ఈ ఎపిసోడ్లో మీరు మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా సింగర్ సాకేత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram)పై వ్యాఖ్యలు చేశారు.’ ఓవర్ రేటెడ్ సింగర్’ అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది అని అడగ్గా.. “సాకేత్ మాట్లాడుతూ.. అందరూ బాగానే పాడుతారు. కానీ సిద్ శ్రీ రామ్ కొంత ఓవర్ రేటెడ్ సింగర్ అని అనిపించింది. ఈవెన్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా అతడు ఓవర్ రేటెడ్ అని చెప్పాలి. అతడు ఎన్నారై కాబట్టి వర్క్ అవుట్ అయ్యింది. మనోళ్లకు పక్కింటి పుల్లకూర రుచి కదా.. అందుకే పక్క వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు. ఎంకరేజ్మెంట్ కూడా అలాగే ఉంటుంది” అంటూ కామెంట్లు చేశారు. దీంతో సాకేత్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే శ్రీరామ్ పై ఒక వర్గం ఆడియన్స్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఎక్కువగా తెలుగు సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఆ పాపులారిటీతోనే రెమ్యునరేషన్ బాగా పెంచేసాడని, పైగా ఒకే మూసలో సాంగ్ పాడుతున్నాడని, కొత్తదనం ఉండట్లేదని ఒక వర్గం వారు విమర్శలు చేశారు. దీనికి తోడు ఇప్పుడు సాకేత్ కూడా ఓవర్ రేటెడ్ సింగర్ అని కామెంట్లు చేయడంతో నిజమేనని సాకేత్ కి వత్తాసు పలికే వారు కూడా లేకపోలేదు.
ALSO READ; Basheer Master : సింగర్ ప్రవస్తి విషయంలో కీరవాణిదే తప్పు.. ఆయనకు నోటిదూల ఎక్కువ..!
అతడికి స్వరం తక్కువ సోకులు ఎక్కువ – సాకేత్
ఇక అలాగే అండర్ రేటడ్ సింగర్స్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే.. కౌశిక్ కళ్యాణ్ (Kaushik Kalyan), శ్రీ సౌమ్య (Sri Soumya)అండర్ రేటెడ్ అనిపిస్తుంది. వాళ్లకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు. వాళ్ళు చాలా టాలెంటెడ్. కానీ అవకాశాలు మాత్రం తక్కువ అంటూ చెప్పుకొచ్చాడు. “స్వరం తక్కువ సోకులు ఎక్కువ ఎవరికి” అని టాక్ షో లో ప్రశ్నించగా సింగర్ రేవంత్ (Singer Revanth) పేరు బయట పెట్టాడు సాకేత్. మొత్తానికి అయితే సాకేత్ ఇలా సింగర్స్ పై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై మిగతా సింగర్స్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలని, అటు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.