BigTV English

 India is world No 1 : ఇండియాకు తిరుగులేదిక.. ఇకపై అభివృద్ధి చెందిన దేశంగా భారత్

 India is world No 1 : ఇండియాకు తిరుగులేదిక.. ఇకపై అభివృద్ధి చెందిన దేశంగా భారత్

India is world No 1 : ఇండియానే వరల్డ్ నెంబర్ వన్. రష్యా-ఉక్రెయిన్ వార్ జరుగుతున్నా.. ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గానే నిలబడింది.  అమెరికా, యూరప్ లో బ్యాంకింగ్ సంక్షోభం నివురుగప్పిన నిప్పులా రగులుతున్నా.. ఇండియాపై పడే ఎఫెక్ట్ ఏమీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం వస్తున్నా.. ఇండియా ఎకానమీ ఎప్పటిలాగే ఫుల్ స్ట్రెంథ్‌తో ఉండబోతోంది. ఓవైపు అమెరికా సహా యూరప్ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. కాని, ఇండియా మాత్రమే స్ట్రాంగ్ గా ఉందిప్పుడు. అందుకే, ఇండియానే వరల్డ్ గ్రోత్ సెంటర్ అని IMF కితాబు ఇచ్చింది. రీసెంట్‌గా ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన వరల్డ్ జీడీపీ ఎస్టిమేషన్ టేబుల్‌లో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అంతా ఇంతా అని చెప్పుకుంటున్న చైనా కూడా ఇండియా కంటే కిందనే ఉంది. ఇప్పటికిప్పుడు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా, ప్రపంచ దేశాల్లో బ్యాంకులు కుప్పకూలినా, ఆర్థిక మాంద్యం విజృంభించినా.. ఇండియాకు ఏమీ కాదని తేల్చి చెప్పింది.


రెసిషన్‌‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో 75 శాతం ప్రొబబిలిటీతో బ్రిటన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం 65 శాతం ఉంది. అసలు ఇండియాను రెసిషన్ తాకనే తాకదని బ్లూమ్ బర్గ్ గ్రాఫ్ చెబుతోంది. అటు కెనడాలో రెసిషన్‌‌ రావడానికి 60 శాతం అవకాశం ఉందని చెప్పింది. జర్మనీలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు 60‌‌‌‌ శాతం ఉన్నాయని ఈ గ్రాఫ్‌‌ చెబుతున్నా.. ఆల్రడీ జర్మనీ రెసిషన్ లోనే ఉంది.

ఇక ఐఎంఎఫ్ విడుదల చేసిన గ్రాఫ్లో.. వివిధ దేశాల జీడీపీలో ఇండియానే నెంబర్ వన్. ఇండియా ఈసారి 5.9 శాతం వృద్ధిరేటుతో వరల్డ్ నెంబర్ వన్ గా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. చైనా గ్రోత్ రేట్ 5.2 శాతంగా ఉంటుందని అంచనా. యూరోజోన్‌లో 0.8 పర్సెంట్ గ్రోత్ ఉండబోతోంది. ఆశ్చర్యంగా రష్యా 0.7 శాతం గ్రోత్ రికార్డ్ చేయబోతోంది. అమెరికా జీడీపీ గ్రోత్ 1.6 శాతానికే పరిమితం కానుంది. కెనడా గ్రోత్ రేట్ 1.5 శాతం నమోదు చేస్తే.. జర్మనీ నెగెటివ్ గ్రోత్‌‌ నమోదు చేస్తుందని తన గ్రాఫ్ లో తెలిపింది. అడ్వాన్స్డ్ ఎకానమీస్‌లో 90 పర్సెంట్ కంట్రీస్ గ్రోత్ రేట్ తగ్గుతుందనేది ఐఎంఎఫ్ అంచనా. 


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×