Trump on IND PAK War: మొత్తానికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి పులిస్టాప్ పడింది. మిసైల్స్, డ్రోన్ల అటాక్ లు, కాల్పుల మోతలు ఆగిపోయాయి. దాయాది దేశం కోరిక మేరికు భారత ప్రభుత్వం కాల్పులు విరమణకు ఓకే చెప్పింది. ఈ క్రమంలోనే రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. భారత్- పాకిస్థాన్ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జరిపిన చర్యలు సఫలం అయ్యాయి. రెండు దేశాలు కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే భారత్- పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కీలక ప్రటనే ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని అన్నారు. తక్షణ సీజ్ ఫైర్ కు భారత్, పాకిస్థాన్ అంగీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. రాత్రంతా భారత్- పాకిస్థాన్ దేశాలతో చర్చించామని అన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాలకు అభినందనలు తెలిపారు.
Also Read: India Vs Pakistan War : హిందువులు, ఆలయాలే టార్గెట్.. పహల్గాం ఉగ్రవాదుల్లానే పాకిస్తాన్
ఈ క్రమంలోనే విదేశాంగ కార్యదర్శి మిస్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాల్పుల విరమణను భారత ప్రభుత్వం ధృవీకరించినట్టు తెలిపారు. ‘సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. ఈ రోజు మధ్యాహ్నం 3:35 గంటలకు పాక్ డీజీఎంవో నుంచి భారత్ డీజీఎంవోకు ఫోన్ కాల్ వచ్చింది. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలించినట్టు పాక్ మంత్రి ఇషాక్ దర్ ప్రకటించారు. ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఈ నెల 12న ఇరు దేశాల మిలటరీ జనరల్ తదుపరి చర్చల గురించి మాట్లాడుకోనున్నారు’ అని ఆయన వెల్లడించారు.
Also Read: Venu Swamy Prediction: యుద్ధంలో పెద్ద నాయకులు, నటులు మరణిస్తారు: వేణుస్వామి జోస్యం
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025