Jay Shah – IPL: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ గురించి సంచలన విషయం బయటపడింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ను దుబాయ్ కి తరలించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే ఈ తరలింపునకు ముందుగా దుబాయ్ ఓకే చెప్పి ఆ తర్వాత.. హ్యాండ్ ఇచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును తమ దేశంలో నిర్వహించడానికి వీలు లేదని దుబాయ్ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.
Also Read: IPL 2025 Update: ఐపీఎల్ 2025 కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఈ 3 మూడు వేదికల్లోనే మ్యాచ్ లు
అయితే… ఈ విషయంలో దుబాయ్ వెనక్కి తగ్గడం వెనుక ఐసీసీ చైర్మన్ జై షా ఉన్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ను దుబాయ్ లో నిర్వహిస్తే… మీకు ఐసీసీ నుంచి వచ్చే ఆర్థిక నిధులు ఆపేస్తామని జైషా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ వెనక్కి తగ్గిందని వార్తలు వస్తున్నాయి.
గత ఏడాది చివర లో భారత నియంత్రణ మండలి కార్యదర్శిగా ఉన్న జై షా… ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే… దుబాయ్ పై ఒత్తిడి పెంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు చుక్కలు చూపించారు. అప్పట్లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు కూడా పాకిస్తాన్ లో జరగకుండా హైబ్రిడ్ మోడల్ లో జరిగేలా… పాకిస్తాన్ మెడలు వంచాడు. ఈ దెబ్బకు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… సగం పాకిస్తాన్ అలాగే.. ఇండియా మ్యాచ్లు దుబాయిలో జరిగాయి. ఇక ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్కు కూడా షాక్ ఇచ్చేలా… చక్రం తిప్పారు అమిత్ షా కుమారుడు జై షా.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ రీస్టార్ట్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కాసేపటి క్రితమే యుద్ధం ముగిసింది. దింతో ఐపిఎల్ 2025 పునః ప్రారంభం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు…. సమావేశం కాబోతున్నారు. ఈ సందర్భంగా ఐపిఎల్ షెడ్యూల్.. ఫైనల్ చేస్తారు. పాకిస్తాన్ బోర్డర్ కు దగ్గరగా ఉన్న స్టేడియాలలో కాకుండా… దక్షిణ భారతదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే… హైదరాబాద్, చెన్నై అలాగే బెంగళూరు వేదికలలో మ్యాచులు జరుగుతాయి. ఈ ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో కీలకమైన 16 మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఈ 16 మ్యాచ్లను కూడా… కేవలం మూడు స్టేడియాలలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఎలాంటి యుద్ధం జరిగిన కూడా సమస్యలు రావని అంచనా వేస్తున్నారు అధికారులు.
Also Read: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ లో ఐపీఎల్ ప్లేయర్స్.. ఎంత ఖర్చు చేశారో తెలుసా ?
🚨 IPL 2025 RESUMPTION. 🚨
– The BCCI has shortlisted Bengaluru, Chennai and Hyderabad as the 3 venues to host the remaining 16 matches of IPL 2025. (Espncricinfo). pic.twitter.com/NtVyUIlXXn
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2025