BigTV English

Prayagraj Air Force Day : 72 ఏళ్ల తర్వాత వైమానిక దళ జెండా మార్పు

Prayagraj Air Force Day : 72 ఏళ్ల తర్వాత వైమానిక దళ జెండా మార్పు

Prayagraj Air Force Day : భారత వైమానిక దళం (Indian Air Force) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 91వ ఎయిర్‌ఫోర్స్ డే వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా వైమానిక దళంతో పరేడ్, వైమానిక ప్రదర్శనను నిర్వహించారు. 72 ఏళ్ల తర్వాత భారత వైమానిక దళం తన జెండాను మార్చింది. భారత వైమానిక దళం తన విలువలను మెరుగ్గా ప్రతిబింబించేలా ప్రయాగ్‌రాజ్‌లో వార్షిక ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్‌లో తన కొత్త జెండాను ఆవిష్కరించింది. గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామి పరేడ్‌కు నాయకత్వం వహించారు. పెరేడ్ సమయంలో ఎటువంటి సమస్య లేదన్నారు. మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి అంచెలంచెలుగా ఎదగాలని షాలిజా ధామి హితవు పలికారు.


ప్రయాగ్‌ రాజ్‌లో ఎయిర్‌ఫోర్స్ డే పరేడ్, వైమానిక ప్రదర్శనను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీ.ఆర్, సైనికాధికారి చౌదరి హాజరయ్యారు. 2021 వరకు ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో కవాతు సాంప్రదాయకంగా నిర్వహించేవారు. అంతకు మందు ఢిల్లీ వెలుపల నిర్వహించేవారు. గతేడాది చండీగఢ్‌లో కవాతు నిర్వహించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×