BigTV English

Indian Army New Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది..

Indian Army New Chief: కొత్త ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది..

General Upendra Dwivedi as a New Indian Army Chief: ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే స్థానంలో నియమించారు. ఈనెల 30న మనోజ్ పాండే పదవీ విరమణ చేస్తుండగా.. ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది అదే రోజు బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ శాఖ తెలిపింది. లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు.


40 ఏళ్ల సర్వీస్..

ఉపేంద్ర ద్వివేది జులై 1 నుంచి భారత సైన్యాన్ని నడిపంచనున్నారు. 1964లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది.. 1984 డిసెంబర్ 15న భారత సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్ జమ్మూకాశ్మీర్ రైఫిల్స్‌లో చేరారు. ఇప్పటివరకు 40 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ద్వివేది.. ఆర్మీలో పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కాశ్మీర్ వ్యాలీ, రాజస్థాన్ సెక్టార్‌లో పనిచేశారు. కమాండ్ ఆఫ్ రెజిమెంట్, బ్రీగేడ్, 9 కార్ప్స్ కమాండ్, డీఐసీ అస్సాం రైఫిల్స్ నియామకాల్లో పనిచేశారు. దీంతోపాటు డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫాంట్రీ, నార్తర్న్ కబమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు.


ప్రతిష్టాత్మక మెడల్స్..

విద్యాభ్యాసం విషయానికొస్తే.. ద్వివేది రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, యూఎస్ ఆర్మీ వార్ కాలేజీల్లో చదివారు. ఆ తర్వాత డిఫెన్స్, మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్ చేశారు. అలాగే డీఎస్ఎస్సీ వెల్లింగ్టన్, మోవ్‌లో కోర్సులు చేశారు. ఈయనకు యూఎస్ ఆర్మీ వార్ కాలేజీలో ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’ పొందారు. దీంతోపాటు కేంద్ర బలగాల్లో చేసిన సేవలకు గానూ ఉపేంద్ర పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం మెడల్స్ పొందారు. ద్వివేది తర్వాత అత్యంత సీనియర్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్, దక్షిణ మిలిటరీ కమాండ్ కమాండర్ ఉన్నారు.

Also Read: వీఐపీల భద్రతలో మార్పులు, ఎన్ఎస్‌జీని తప్పించి.. ఆ స్థానంలో

30 రోజుల పొడిగింపు

వాస్తవానికి జనరల్ మనోజ్ పాండే.. మే 31న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్రం పాండే పదవీ కాలాన్ని 30 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈయన 2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్‌గా విధుల్లో చేరారు. అయితే ఆర్మీ చీఫ్ పదవీ కాలం పొడిగించడం అత్యంత అరుదు. అంతకుముందు 1970లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ జీజీ బేవూర్ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు. కాగా, జనరల్ పాండేతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు ఈనెల చివరిలోగా పదవీ విరమణ చేయనున్నారు.

Tags

Related News

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

Big Stories

×