BigTV English

Indian Railways : రైలు ప్రమాదాలు.. తీసుకున్న చర్యలేంటి..? కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న..

Indian Railways : ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ ‘కవచ్‌’ తోపాటు రైల్వేలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి వివరాలు ఇవ్వాలని భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారతీయ రైల్వేలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి ప్రమాదాలు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే. రైల్వే ప్రమాదాల నివారణకు ఇప్పటికే అమలు చేస్తున్న, ప్రతిపాదిత రక్షణ చర్యల గురించి తెలియజేయాలని సూచించింది. రైల్వేలో ప్రమాదాలు నివారించడానికి ‘రైల్వే ప్రమాదాల రక్షణ’ చర్యలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వివరాలను కోరింది.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో గతేడాది జూన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైల్వే తీసుకుంటున్న భద్రతా చర్యల గురించి తెలిపాలని సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. గత మూడు దశాబ్దాల్లో రైళ్లు ఢీకొట్టడం వల్ల జరిగిన అనేక ప్రమాదాలను న్యాయస్థానం దృష్టికి పిటిషన్‌ దారుడు తీసుకెళ్లారు.

భద్రతా చర్యలను బలోపేతం చేయడంలో భారతీయ రైల్వే తాత్సారం చేస్తోందని అన్నారు. పిటిషనర్‌ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ప్రస్తుతం అమలు చేస్తున్న భద్రతా చర్యలపై వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ దేశవ్యాప్తంగా కవచ్‌ను అందుబాటులో ఉంచాలంటే ఆర్థిక ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపై కసరత్తు చేశారా? అని ప్రశ్నించింది.

భారతీయ రైల్వేలో ప్రమాదాల నివారణకు ‘రైల్వే ప్రమాదాల రక్షణ’ చర్యలను అమలు చేసేలా ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాల్‌ తివారీ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రైల్వేలో ప్రమాదాల నివారణ కోసం ఇప్పటికే అమలు చేస్తున్నవి ఏమిటని ప్రశ్నించింది. మున్ముందు అమలు చేసేందుకు ప్రతిపాదించిన రక్షణ చర్యల గురించి తెలియజేయాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. పిటిషిన్‌ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×