BigTV English
Advertisement

Metro Rail : లక్ష్యానికి దూరంగా మెట్రో రైళ్లు.. అంచనాలు తప్పాయా..?

Metro Rail : లక్ష్యానికి దూరంగా మెట్రో రైళ్లు.. అంచనాలు తప్పాయా..?

Metro Rail : దేశంలో మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌లపై అంచనాలు తప్పుతున్నాయి. ఆశించిన రీతిలో ప్రయాణికులను మెట్రో రైళ్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. రైడర్‌షిప్ అంచనాల్లో 50 శాతం మించడం లేదని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు ఐఐటీ-ఢిల్లీ, ఢిల్లీకి చెందిన మేధోమథన సంస్థ ఇన్‌ఫ్రా విజన్ ఫౌండేషన్ సంయుక్త సర్వే చేపట్టాయి. దేశంలోని అత్యధిక మెట్రోరైళ్లను పరిశీలిస్తే.. ప్రొజెక్టెడ్ రైడర్‌షిప్‌లో 25-30 శాతమే సాధిస్తున్నట్టు ఆ నివేదిక తెలిపింది.


ఢిల్లీ మెట్రో రైల్ ను మినహాయిస్తే.. ఇతర మెట్రోరైల్ వ్యవస్థలన్నీ ప్రొజెక్డెడ్ రైడర్‌షిప్ అంచనాలను చేరుకోలేకపోతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలు మాత్రం రైడర్‌షిప్ అంచనాల్లో 47.45% సాధించినట్టు నివేదించారు. 1984లో కోల్‌కతాలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. భారతీయ రైల్వే ఆ ప్రాజెక్టును చేపట్టింది. 2002లో ఢిల్లీ మెట్రో తొలి కారిడార్ పనులు ఆరంభమైన తర్వాతే మెట్రో రైల్ వ్యవస్థలు ఊపందుకున్నాయి.

ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్ సహా 20 నగరాల్లో మెట్రో వ్యవస్థలు విస్తరించాయి. మొత్తం 905 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇందులో 600 కిలోమీటర్ల మార్గం గత 9 ఏళ్లలో ఆమోదం పొందిందే. కాన్పూర్, సూరత్, అహ్మదాబాద్, భోపాల్, ఇందౌర్, ఆగ్రా, పట్నా, కొచి, పుణె, నాగ్‌పూర్, లఖ్‌నవూ సిటీల కోసం ఈ మెట్రో ప్రాజెక్టులను ఆమోదించారు. అయితే ఆయా ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ అంచనా ప్రయాణికుల సంఖ్యను అందుకోలేకపోయాయి.


మెట్రో రైళ్లు ఎక్కే ప్రయాణికుల సంఖ్య బాగా తక్కువగా ఉండటంపై పార్లమెంటరీ సంఘం ఒకటి నిరుడు జూలైలో ఓ నివేదిక సమర్పించింది. దాని ప్రకారం 2020-21 మధ్య ఢిల్లీ మెట్రోలో సగటున రోజూ 50.65 లక్షల మంది ప్రయాణించారు. అప్పటికీ బ్రేక్ఈవెన్ సాధనకు ఇంకా 38.34 లక్షల మంది తక్కువే ఉన్నారని ఆ ప్యానెల్ స్పష్టం చేసింది. అయితే రైడర్‌షిప్ టార్గెట్‌ను ఢిల్లీ మెట్రో చేరిందని డీఎంఆర్‌సీ అధికారులు చెబుతున్నారు. రోజూ 67 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ప్రొజెక్టెడ్ రైడర్ షిప్ కన్నా ఈ సంఖ్య ఎంతో ఎక్కువని వివరించారు. కొవిడ్ సమయంలో ప్రయాణికులు బాగా తగ్గినా.. ప్రస్తుతం వారి సంఖ్య పెరుగుతోందని ఢిల్లీ మెట్రో అధికారులు చెప్పారు.

మెట్రో రైల్ ప్రాజెక్టులను చేపట్టంతోనే సరిపెడితే కుదరదని నివేదికలో ఐఐటీ-ఢిల్లీ స్పష్టం చేసింది. అన్ని నగరాల్లో మెట్రో రైళ్ల సమయాలకు అనుగుణంగా బస్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలను ప్రభుత్వాలు అనుసంధానించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల్లో మూడోవంతు మంది ప్రతి రోజూ కనీసం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తారని నివేదిక పేర్కొంది. అర్బన్ ప్రాంతాల్లో జనాభా ఆధారంగా వర్క్-రిలేటెడ్ ట్రావెల్ ప్యాట్రన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

Tags

Related News

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Big Stories

×