IndiGo- Air India: శీతాకాలం సీజన్ నేపథ్యంలో ఉత్తర భారతదేశాన్ని చలి-పులి వణికిస్తోంది. ఉష్టోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీని ప్రభావం అటు విమానాల రాకపోకలపై పడింది. ఈ నేపథ్యంలో ఇండిగో-ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ సంస్థలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.
విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
శీతాకాలం ప్రారంభం కావడంతో ఉత్తర భారతదేశమంతటా రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీని కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది.
ఈ సమాచారాన్ని ప్రయాణికులకు అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్ పోర్టుకు వెళ్ళేముందు ట్రావెల్ ప్రస్తుత స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచన చేసింది. ఈ విషయంలో వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండేలా తాము అన్నిరకాల సర్దుబాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఎయిరిండియా-ఇండిగో సంస్థలు
మీ అవగాహనకు, మాపై మీ నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేసింది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, ప్రయాణాలు సజావుగా చేయడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఇండియా సంస్థ కూడా ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరి జారీ చేసింది.
ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాల ప్రయాణాలు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. దీని కారణంగా అనేక విమానాలు ఆలస్యంగా బయలు దేరుతున్నాయని, మరి కొన్నింటిని రద్దు చేసినట్టు పేర్కొంది.
అనివార్య పరిస్థితులు ఎదురైతే.. ప్రయాణీకులకు రీబుకింగ్ లేదా వారి విమానాలు రద్దు చేయబడితే పూర్తి వాపసు అందించడంలో సహాయం చేయడానికి మా బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయని రాసుకొచ్చింది. ఇవాళ పొగమంచు పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్టు తెలియజేసింది.
ALSO READ: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోరం.. మంటల్లో నాలుగు బస్సులు
కొన్ని ప్రాంతాలకు వెళ్లాల్సిన కొన్ని విమానాలను ఇప్పటికే రద్దు చేశామని తెలిపింది. అసౌకర్యాన్ని తగ్గించడానికి ఫాగ్ కేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామని రాసుకొచ్చింది. దీని కారణంగా ప్రభావితమైన, ప్రభావితమయ్యే విమానాల గురించి సమాచారం ప్రయాణీకులకు ముందుగానే తెలియజేస్తున్నట్లు ప్రస్తావించింది.
రీషెడ్యూలింగ్ లేదా మనీని పూర్తి వాపసు అందిస్తామని రాసుకొచ్చింది. ప్రభావితమైన ప్రయాణీకుల వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా సంప్రదిస్తామని తెలిపింది. మా నుండి ఎలాంటి సమాచారం అందకపోతే, మీ బుకింగ్‌లోని సంప్రదింపు సమాచారం మీ ట్రావెల్ ఏజెంట్ లేదా మీ తరపున బుక్ చేసుకున్న వ్యక్తిది కావచ్చు, వారికి నోటిఫికేషన్ పంపబడుతుందని పేర్కొంది. విమానాశ్రయం బయలుదేరే ముందు విమాన స్థితిని తనిఖీ చేసి ప్రయాణాలకు అనుమతి ఇస్తామని, అందుకోసం అదనపు సమయం కేటాయించవలసి వస్తుందని పేర్కొంది.
Travel Advisory
As winter sets in, early mornings across Northern India can bring fog that may occasionally slow down flight movements. We wanted to share this gentle heads-up in advance, so you can plan with ease and check your flight status before heading to the airport…
— IndiGo (@IndiGo6E) December 15, 2025
Dense fog enveloping Delhi and parts of Northern India early this morning caused flight disruptions across airlines, leading to significant air traffic congestion at the Delhi Airport and parking bay constraints, among multiple other challenges. Regrettably,…
— Air India (@airindia) December 15, 2025