E-Paper
Advertisement

Brahmamudi Serial Today December 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఫంకన్ లో డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ 

Brahmamudi Serial Today December 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఫంకన్ లో డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ 
Advertisement

Brahmamudi serial today Episode:  

స్టేషన్‌కు వెళ్లిన అప్పు పాప కు సంబంధించిన ఫైల్‌ తెప్పించుకుని చూస్తుంది. ఫైల్‌ చూసి అప్పు షాక్‌ అవుతుంది.  ఇంతలో అప్పు దగ్గరకు సీఐ వస్తాడు.  అపూర్వ ఏంటి నిన్న ఎమ్మెల్యే గారి అల్లుడి కేసు విషయంలో వారి ఇంటికి వెళ్లలేదంట అని అడగ్గానే.. సార్‌ నేను రేణుక గారి పాప కేసు విషయంలో కొంచెం బిజీగా ఉన్నాను సార్‌ అంటుంది అప్పు.. దీంతో సీఐ కోపంగా నీకెలా చెప్పాలి అపూర్వ.. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? ఆ పాప కేసు క్లోజ్‌ చేయమన్నాను.. ఎమ్మెల్యే గారి అల్లుడి గారి కేసు టేకప్‌ చేయమన్నాను.. అయినా చెవికి ఎక్కించుకోవడం లేదు.. నీకు సుపీరియర్‌ అంటే లెక్కలేదా..? లేదా ఉద్యోగం చేయడం ఇంట్రస్ట్‌ లేదా..? అంటూ తిట్టగానే.. అపూర్వ అది కాదు సార్‌ నేను చెప్పేది వినండి అనగానే.. ఏంటి వినేది..? ఇంకా ఎన్నాళ్లనీ ఇలా అర్థం పర్థం లేని కేసు పట్టుకుని వేలాడతావు.. అనగానే…

అప్పు ఫైల్ తీసుకుని రేణుక పాప కేసు అర్థం పర్థం లేని కేసు కాదు సార్‌.. ఆలోచించాల్సిన కేసు.. ఒక్కసారి ఇది చూడండి.. అంటూ ఫైల్‌ ఇవ్వబోతే ఏంటిది అని సీఐ అడగ్గానే.. సంవత్సరం క్రితం డ్రైనేజీలో శవంగా దొరికిన ఆ పాపకు చెందిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. మళ్లీ రీ పోస్ట్ మార్ట్ చేయిస్తున్నానని చెప్పాను కదా..? ఆ రిపోర్ట్ వచ్చాయి.. ఒక్కసారి చూడండి.. అంటూ ఫైల్‌ చూపిస్తుంది అప్పు.. చనిపోయిన పాప డీఎన్‌ఏకి రేణుక డీఎన్‌ఏకి మ్యాచ్ కావడం లేదు సార్‌.. వాళ్లిద్దరికీ ఏ సంబంధం లేదు.. అని చెప్పగానే.. కానీ ఆరోజు అంటూ సీఐ ఏదో అడగబోతుంటే.. గతంలో ఎవరో ఫేక్‌ ఫోస్ట్‌మార్టం చేయించారు. రేణుక పాప చనిపోయిందని అబద్దం చెప్పించారు సార్‌….

Advertisement

అని అపూర్వ చెప్పగానే.. అంటే ఆ పాప అని అడగబోతుంటే.. ఎక్కడుందో తెలియదు కానీ కచ్చితంగా బతికే ఉంది. సంవత్సర కాలం నుంచి తన తల్లి వస్తుందని.. తనను కాపాడుతుందని ఎదురుచూస్తూనే ఉంటుంది. దయచేసి ఈ కేసు విషయంలో నన్ను ఆపకండి సార్‌.. ఆ పాప ఎక్కడున్నా వెతికి పట్టుకుని రేణుకకు అప్పగించే బాధ్యత నాది సార్‌.. అని అపూర్వ అడగ్గానే.. సీఐ ఆశ్చర్యంగా వెల్‌డన్‌ అపూర్వ.. అసలు విషయమే లేని కేసని క్లోజ్‌ చేశాక నువ్వు ఈ కేసును టేకప్‌ చేసి పురోగతి సాధించావు.. వీలైనంత త్వరగా ఆ పాపను పట్టుకుని ఈ కేసును క్లోజ్‌ చేయ్‌ అని చెప్తాడు సీఐ. తప్పకుండా పట్టుకుంటాను సార్ అని చెప్తుంది అపూర్వ.

మరోవైపు అవార్డు పంక్షన్‌లో రాహుల్ గీసిన డిజైన్స్‌ అని డిస్ప్లేలో వేయగానే.. అవి చూసి కావ్య, రాజ్‌ షాక్‌ అవుతారు. రాజ్‌ కోపంగా రాహుల్‌ వైపు వెళ్లబోతుంటే.. కావ్య ఆపేస్తుంది. స్టేజీ మీద ఉన్న రాహుల్‌ అంత గమనిస్తుంటాడు. తర్వాత మొత్తం డిజైన్స్‌ తానే వేసినట్టు బిల్డప్‌ ఇస్తాడు. అవార్డు కూడా రాజ్‌ చేతుల మీదుగానే తీసుకోవాలి అని చెప్తాడు. రాజ్‌ కోపంగా వెళ్లి అవార్డ్ ఇచ్చి వస్తాడు.

Advertisement

మరోవైపు ధాన్యలక్ష్మీ భోజనం తీసుకుని వెళ్తుంటే కళ్యాణ్ చూసి అమ్మా ఎవరికి భోజనం తీసుకెళ్తున్నావు అని అడుగుతాడు. ఇంకెవరికి తీసుకెళ్తాను నా కోడలు అప్పుకు తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. కళ్యాణ్‌ ఆగమని చెప్పినా వినకుండా పైకి వెళ్లిపోతుంది. పైన ప్రకాష్‌ దుప్పటి కప్పుకుని అప్పులాగా నటిస్తాడు. ధాన్యం భోజనం పక్కన పెట్టి వెళ్లిపోతుంది.

మరోవైపు అవార్డు ఫంక్షన్‌ నుంచి బయటకు వచ్చిన రాజ్ కోపంగా రాహుల్‌ను తిడుతుంటాడు. నీ నమ్మకాన్ని నా నమ్మకాన్ని మోసం చేశాడు వాడు. ఈ రోజు ఇంతకు తెగించిన వాడు రేపు మళ్లీ మళ్లీ మోసం చేయకుండా ఉంటాడా..? కళావతి.. ఈరోజు ఇప్పుడే వాడికి శిక్ష పడాలి అంటూ రాజ్‌ కోపంగా వెళ్లిపోతుంటే.. కావ్య అపేస్తుంది. ఏవండి ఒక్క నిమిషం ఆగండి.. నేను చెప్పేది కాస్త వినండి.. అనగానే లేదు కళావతి నువ్వు ఎప్పుడు ఏది చెప్పినా నేను కాదనలేదు.. కానీ ఈ విషయంలో నేను నీ మాట వినను అంటూ రాహుల్‌ వైపు వెళ్లబోతుంటే.. అవార్డు పట్టుకుని స్వప్న ఎదురొస్తుంది. ఎమోషనల్‌ అవుతూ రాజ్‌, కావ్యకు థాంక్స్‌ చెప్తుంది. రాహుల్‌కు మీరు చేసిన హెల్ప్ కే మీ రుణం ఎలా తీర్చుకోగలం.. అంటూ సంతోషంతో ఏడుస్తుంది. స్వప్న మాటలకు రాజ్‌ అక్కడే ఆగిపోతాడు. స్వప్న ఎందుకు ఇప్పుడివన్నీ అంటూ స్వప్నను ఓదారుస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×