India Pakistan War : ఆపరేషన్ సిందూర్. హిడెన్ సీక్రెట్స్ ఇంకా ఉన్నాయంటున్నారు. 25 నిమిషాలు.. 24 మిస్సైళ్లు.. 9 టార్గెట్లు.. 80 మంది ఉగ్రవాదులు.. ఇంతేనా? ఇంకా ఉందా? అంటే.. హ, ఉందనే చెబుతున్నారు. లేటెస్ట్‌గా ఓ పాకిస్తాన్ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెషావర్ విమానాశ్రయం నుంచి అతను ఆ వీడియో చేశాడు. అందులో సంచలన విషయాలు చెప్పాడు.
ఆ 2 యుద్ధ విమానాలు ఏమయ్యాయి?
ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కూర్చొన్న ఆ యువకుడు.. విమానాశ్రయంలో ఎమర్జెన్సీ విధించారని చెప్పాడు. ఇప్పుడే ఇక్కడి నుంచి పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 4 యుద్ధ విమానాలు వెళ్లాయని అన్నాడు. అయితే, కాసేపటికే అందులోంచి రెండు ఫైటర్ జెట్స్ మాత్రమే తిరిగి వచ్చాయని తెలిపాడు. నాలుగు వెళితే, రెండు మాత్రమే రిటర్న్ రావడం ఏంటి? అంటే, మిగతా ఆ రెండు పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఏమైనట్టు? ఎక్కడికి వెళ్లినట్టు? వాటిని ఇండియన్ ఆర్మీ కూల్చేసిందా? అనే చర్చ నడుస్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకే కాదు… పాకిస్తాన్ ఆర్మీకి కూడా చావుదెబ్బ తగిలిందా? అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవలే పాక్‌కు సపోర్ట్‌గా టర్కీ 6 ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్‌కు పంపించింది. ఆ విమానాలు ఏమైనా మిస్ అయ్యాయా? మరోవైపు, ఆ పాకిస్తానీ చెప్పేదంతా నిజమేనా? కాదా? అనే విషయంపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ ఆర్మీ.. అడ్డంగా దొరికిపోయారు..
అతడే ప్రత్యక్ష సాక్షి..
ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో తాను పెషావర్ ఎయిర్‌పోర్టులోనే ఉన్నాననేది ఆ వీడియోలోని యువకుడు చెబుతున్న మాట. భారత దాడులను ఆలస్యంగా తెలుసుకున్న పాకిస్తాన్.. ఆ తర్వాత బోర్డర్‌కు తన యుద్ధ విమానాలను పంపించిందా? అనే అనుమానం వస్తోంది. అయితే, అన్నిటికీ ముందే సిద్ధంగా ఉన్న ఇండియన్ ఆర్మీ.. పాక్ ఫైటర్ జెట్లను ధీటుగా ఎదుర్కొందా? లేదంటే, వాటిని పడగొట్టేసిందా? ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. అసలేం జరిగిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇండియా, పాకిస్తాన్ ఇరు దేశాలు యుద్ధ విమానాలపై ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి, ఆ పాకిస్తాన్ యువకుడు చెప్పేదాంట్లో నిజమెంత అనేది అతనికే తెలియాలి.