BigTV English

Trolls on RGV : రక్త చరిత్ర.. సాంగ్‌తో అజీత్ దోవల్ ట్వీట్.. పప్పులో కాలేసిన ఆర్జీవీ

Trolls on RGV : రక్త చరిత్ర.. సాంగ్‌తో అజీత్ దోవల్ ట్వీట్.. పప్పులో కాలేసిన ఆర్జీవీ

Trolls on RGV : భారత్ – పాక్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా భారతదేశం చేసిన ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindhoor) పై సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా భారతీయ పౌరులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తరచుగా వివాదాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) తాజాగా పప్పులో కాలేశారు. దీంతో ఈ మాత్రం కూడా తెలీదా? అంటూ నెటిజెన్లు ట్రోల్ చేయడంతో వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేశారు.


అసలు ఏం జరిగిందంటే? 

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరుతో ఉన్న ఓ ఎకౌంట్ నుంచి భారత సైన్యంపై స్పెషల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. అందులో రాంగోపాల్ వర్మ సినిమా ‘రక్త చరిత్ర’లోని టైటిల్ సాంగ్ ని వాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, దాని ఆర్జీవి రీట్వీట్ చేశారు. రీట్వీట్ చేసినా పర్లేదు కానీ, దానికి మురిసిపోతూ ఆయన చేసిన కామెంట్ ఆర్జీవిని వార్తాల్లో నిలిచేలా చేసింది.


ఆ ట్వీట్ లో ఆర్జీవి “అజిత్ దోవల్ స్వయంగా పిన్ చేసిన ట్వీట్ ఇది… వావ్ నేను మీ టీంలో పార్ట్ అవ్వడంపై సూపర్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్” అంటూ రాస్కొచ్చారు. కానీ అది నిజానికి అజిత్ దోవల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కాదు. అదొక పేరడీ ఎకౌంటు. ఈ విషయంలో బయోతో పాటు ఆ ట్విట్టర్ ఎకౌంట్ లో స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. దీంతో “ఆర్జీవి నీకు అది కూడా తెలియదా…అదొక పేరడీ ఎకౌంట్” అంటూ నెటిజెన్స్ కామెంట్స్ వర్షం కురిపించారు.

ఇంకేముంది వెంటనే ఆ జీవితాను పప్పులో కాలేశాను అన్న విషయాన్ని తెలుసుకొని, కొద్ది క్షణాల్లోనే ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆర్జీవి చేసిన ఆ ట్వీట్ స్క్రీన్ షాట్స్ తీసి మరీ ఆయనను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్లు.

Read Also : వందేళ్ల వయసులో భార్యమీద అనుమానం… విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే వృద్ధుడు… ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

పహల్గాం అటాక్ పై ప్రతీకారం 

ఇదిలా ఉండగా భారత్ లో జరిగిన పహల్గాం ఎటాక్ కు ప్రతి కరంగా ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో మంగళవారం అర్ధరాత్రి దాటాక భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. పాక్ లో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ చేసిన ఈ దాడిలో, దాదాపు 70 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం సక్సెస్ ఫుల్ గా దాడులు చేసింది. గత నెలలో పహల్గాంలో విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి, 26 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ తో పాక్ కు భారత్ సరైన గుణపాఠం చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×