Operation Sindoor : పాకిస్తాన్ తరుచూ సుద్దపూస మాటలు చెబుతూ ఉంటుంది. తమకు, ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధాలు లేవని అంటుంది. తమ దేశంలో టెర్రరిస్టులే లేరని.. తాము ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వట్లేదని చెబుతుంది. ఆపరేషన్ సిందూర్‌తో పాక్ గడ్డపై ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ అటాక్ చేశాక.. సుమారు 80 మంది ఉగ్రవాదులను చంపేశాక.. ఇప్పుడు బయటపడింది పాకిస్తాన్ దొంగాట. పాక్ ఆర్మీకి, టెర్రరిస్టులకు ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నాయో ఈ ఫోటో చూస్తేనే తెలిసిపోతోంది.
ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ లింకులు..
మంగళవారం అర్థరాత్రి పాక్‌లోని 9 ప్రాంతాల్లో క్షిపణులతో విరుచుకుపడింది ఇండియా. సెలెక్టివ్‌గా ఉగ్రవాద స్థావరాలను ఎంచుకొని మిసైల్స్‌తో పేల్చేసింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు సుమారు 80 మంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలుస్తోంది. ముస్లిం సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి వెంటనే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. భారత్ దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ అబ్దుల్ హాజరయ్యాడు. ఆయనతో పాటు పాక్ ఆర్మీ అధికారులు అటెండై.. చనిపోయిన టెర్రరిస్టులకు నివాళులు అర్పించారు. లక్షరే ఉగ్రవాదుల శవ పేటికలపై పాక్ జాతీయ జెండాలు కూడా పరిచారు. ఆ ఫోటోనే ఇది. కేవలం అంత్యక్రియల్లో మాత్రమే కాదు.. భారత క్షిపణి దాడుల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లష్కరే ఉగ్రవాదులను సైతం పరామర్శించారు పాక్ ఆర్మీ అధికారులు.
Also Read : మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలిసిందా? మొనగాడ్రా బుజ్జీ..
అడ్డంగా దొరికిపోయిన పాక్
ఉగ్రవాదులు చస్తే.. అక్కడ పాక్ ఆర్మీకి ఏం పని? అనేదే ప్రశ్న. స్థానిక పోలీసులో, అధికారులో వచ్చుంటే అది వేరే విషయం. ఏకంగా ఆర్మీ పెద్దలే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారంటే.. చచ్చిన టెర్రరిస్టులు వాళ్లకు ఎంత ముఖ్యమైన వాళ్లో తెలుస్తోంది. ఉగ్రవాదులతో అంటకాగడం పాక్ ఆర్మీకి కొత్తేం కాదు. ఏళ్లుగా చేస్తున్న పనే. పాముకు పాలుపోసి పెంచినట్టు పెంచుతున్నారు. దేశంలోనే ఉంచుకొని, ట్రైనింగ్, ఆయుధాలు ఇచ్చి మన మీదకు వదులుతున్నారు. పాక్ ఆర్మీకి, ఉగ్రవాదులకు ఆ అక్రమ సంబంధం ఇప్పుడిలా ఓపెన్ అయిపోయింది. పాక్ అడ్డంగా దొరికిపోయింది.