BigTV English

BBC: బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఉద్యోగుల ఫోన్లు సీజ్

BBC: బీబీసీ ఆఫీస్‌పై ఐటీ దాడులు.. ఉద్యోగుల ఫోన్లు సీజ్

BBC: అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయంపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 60 నుంచి 70 మంది అధికారులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బీబీసీ ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


కాగా, ఇటీవల ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అల్లర్లపై బీబీసీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే భారత ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించింది.

ఈ వ్యవహారంపై హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా అత్యున్నత న్యాయం స్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఈ డాక్యుమెంటరీ నేపథ్యంలో బీబీసీని దేశంలో నిషేధించాలంటూ కోర్టును కోరారు. అయితే సుప్రీం ఆ పిటీషన్‌ను తిరస్కరించింది. ఇదిలా ఉండగా బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


ఇక బీబీసీ కార్యాలయంపై ఐటీ సోదాలు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శించారు. ఈమేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×