BigTV English

Vande Bharat Sleeper Trains: తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. సికింద్రాబాద్ టు ముంబై

Vande Bharat Sleeper Trains: తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్.. సికింద్రాబాద్ టు ముంబై

First Vande bharat sleeper train launch update(Telugu news live): వందే భారత్ తొలి స్లీపర్ ట్రైన్‌ను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ఇండియన్ రైల్వే ప్లాన్ చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆగష్టులో పట్టాలు ఎక్కించాలని కసరత్తు చేస్తోంది.


దేశంలో తొలుత సికింద్రాబాద్ నుంచి ముంబై సిటీల మధ్య వందేభారత్ తొలి స్లీపర్ ట్రైన్‌ను నడిపాలని ఆలోచన చేస్తోంది. ముఖ్యమైన రద్దీ కావడం ఒకటైతే, మరొకటి ఈ రెండు నగరాల మధ్య ఇప్పటివరకు వందే భారత్ రైలు లేదు. దీంతో ఈ మార్గాన్ని రైల్వేశాఖ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్‌కు సూచన చేశారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే.. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది.

మరోవైపు సికింద్రాబాద్- రాజ్‌కోట్‌ల ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడుస్తోంది. దీన్ని గుజరాత్‌ లోని కచ్ వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీనివల్ల ఇటు తెలంగాణకు అటు గుజరాత్ కచ్ ప్రాంత‌వాసులకు హెల్ప్ అవుతుందని అంటున్నారు.


ALSO READ: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్‌టికెట్లు విడుదల

ఇదిలాకాకుండా తిరుపతి-నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తోంది రాయలసీమ ఎక్స్‌ప్రెస్. అయితే నిజామాబాద్‌లో ప్లాట్ ఫాంలు ఖాళీ లేక ఈ రైలు బోధన్ వరకు వెళ్తోంది. ఈ రైలును బోధన్ వరకు పొడిగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్షలో వీటి గురించి చర్చించారు. కాచిగూడ- బెంగుళూరు మధ్య 8 కోచ్‌లతో నడుస్తున్న వందే భారత్ ట్రైన్‌కు మాంచి డిమాండ్ ఉంది. దీన్ని 16 కోచ్‌లకు పెంచాలన్న డిమాండ్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిశీస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×