E-Paper
Advertisement

Maharashtra News : జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన అధికారపార్టీ నేతలు.. వీడియో వైరల్..

Maharashtra News  : జర్నలిస్ట్‌ను చితక్కొట్టిన అధికారపార్టీ నేతలు.. వీడియో వైరల్..
Advertisement
Maharashtra News

Maharashtra News : మహారాష్ట్రలోని పచోరాలో జర్నలిస్ట్ సందీప్ మహాజన్‌పై షిండే వర్గాలు దారుణంగా దాడి చేశాయి. స్కూటీపై వెళ్తుండగా కిందపడేసి మరీ చావబాదారు. జల్గావ్-పచోరా తాలూకా ఎమ్మెల్యే కిషోర్ పాటిల్.. జర్నలిస్టు సందీప్ మహాజన్‌ను దుర్భాషలాడిన ఆడియో క్లిప్ ఇటీవల వైరల్‌గా మారింది. కొడతానని ఎమ్మెల్యే బెదిరించారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవా అని ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

జర్నలిస్టు సందీప్ మహాజన్‌ను పచోరాలో కొట్టిన వీడియోను ఎమ్మెల్యే రోహిత్ పవార్ ట్వీట్ చేశారు. జర్నలిస్టును ఫోన్‌లో దుర్భాషలాడారని, చంపేస్తామని బెదిరించారని, మరుసటి రోజు జర్నలిస్టును కొట్టేందుకు గూండాలను పంపారని రోహిత్ పవార్ అన్నారు. ఓ జర్నలిస్టును ఈ విధంగా కొట్టినప్పుడు మహారాష్ట్రలోని జర్నలిస్టులు నిరసన తెలిపే సాహసం కూడా చేయలేదని ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల బాలికను చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఉదంతం జలగావ్ జిల్లాను కుదిపేసింది. ఈ అంశంపై జర్నలిస్టు సందీప్‌ మహాజన్‌.. షిండేపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శను ఎమ్మెల్యే కిషోర్ పాటిల్ జీర్ణించుకోలేక.. నేరుగా జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో, జర్నలిస్టులు ఆడియో క్లిప్ గురించి పాటిల్‌ను ప్రశ్నించారు. ఆ ఆడియో క్లిప్ తనదేనని, జర్నలిస్టును దూషించింది తానేనని కూడా ఎమ్మెల్యే కిషోర్ బాహాటంగా ఒప్పుకున్నారు.

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×