Justice Khanna :
⦿ సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ సంజీవ్ కన్నా ప్రమాణం
⦿ రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం
ఢిల్లీ, స్వేచ్ఛ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నవంబర్ 11న ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఖన్నా చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్ ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వేదిక అయ్యింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక భూమిక పోషించారు. కాగా నవంబర్ 10 తేదీతో సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీకాలం ముగియనుంది.