Hyderabadi Woman Loco Pilot Indira Eegalapati: ఎడారి దేశం సౌది అరేబియాలో మెట్రో రైళ్లు నడపబోతోంది హైదరాబాదీ లేడీ లోకో పైలెట్ ఇందిరా ఈగలపాటి. రియాద్ నగరంలో త్వరలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ మెట్రోకు సంబంధించి ట్రయల్ రన్ నడుస్తోంది. ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ పూర్తవుతున్నందున ఇందిరా రియాద్ లో రైళ్లు నడపబోతోంది. ఐదేళ్లుగా రైలు లోకో పైలట్ గా, స్టేషన్ ఆపరేషన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న 33 ఏళ్ల ఇందిరా ఈగలపాటి తనకు ఈ అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
ఇందిరాతో పాటు మరో ఇద్దరు మహిళలు..
హైదరాబాద్ మెట్రోలో పని చేస్తున్న ఇందిరా రియాద్ లో ఓపెనింగ్స్ గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఆమె దరఖాస్తును పరిశీలించి ఓకే చేశారు. ఇందిరాతో పాటు ఇండియాకు చెందిన మరో ఇద్దరు మహిళా లోకో పైలెట్లు కూడా గతంలోనే అప్లై చేసుకున్నారు. వారు కూడా ఎంపిక అయ్యారు. ప్రస్తుతం రియాద్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్ నడుస్తోంది. 2025 నుంచి అక్కడ మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి.
గర్వించే అవకాశం- ఇందిరా
రియాద్ మెట్రోలో లోకో పైలెట్ గా భాగం కావడ పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు ఇందిరా వెల్లడించింది. “ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం పట్ల నిజంగా గర్విస్తున్నాను. సౌదీ అరేబియా ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటున్నారు. గొప్ప సంస్కృతిని కలిగి ఉన్నారు. మాకు ఇక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి. లింగ పక్షపాతం లేదు. త్వరలో మెట్రో సేవలు ప్రారంభంకాబోతున్నాయి” అని వెల్లడించింది.
Read Also: ఈ యాప్ జోలికి అస్సలు వెళ్లకండి, రైల్వే ప్రయాణీకులకు IRCTC వార్నింగ్!
ఎవరీ ఇందిరా ఈగలపాటి
ఈగలపాటి ఇందిర స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుల్లిపాళ్ల. 2006లో ఆమె కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. ఆమె వయసు 33 ఏండ్లు. ఆమె తండ్రి ఓ సాధారణ మెకానిక్. “నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మేం ముమ్మరం అక్కాచెల్లెళ్లం. మా నాన్న మెకానిక్ అయినప్పటికీ మమ్మల్ని బాగా చదివించారు. చదువు ద్వారానే మేం మంచి స్థాయికి చేరుకుంటామని మా నాన్న నమ్మారు. ఆయన కలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాం” అని చెప్పుకొచ్చింది.
ఇందిరా ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఇందిరా అక్క టీచర్ గా పని చేస్తుంది. ఇందిరా చెల్లి హైదరాబాద్ మెట్రోలో రైలు లోకో పైలట్‌గా పని చేస్తున్నది. ఆమె భర్త కూడా మెట్రో మెయింటెనెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. మొత్తంగా ఇందిరా అక్కా చెల్లెల్లు పేద కుటుంబ నుంచి వచ్చి, మంచి స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఇందిరా ఏకంగా అంతర్జాతీయ స్థాయి లోకో పైలెట్ గా గుర్తింపు తెచ్చుకోవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: రైలు సైడ్ లోయర్ బెర్త్ లో ఆ వైపు తిరిగి పడుకుంటున్నారా? చాలా తప్పు చేస్తున్నారు!