CJI Sanjiv Khanna Oath: సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. 51వ సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ ఖన్నా అతి తక్కువ కాలంలోనే పదవీ విరమణ చేయనున్నారు. 2024 మే 13కే ఖన్నాకు 65 ఏళ్లు నిండనున్నాయి. దీంతో అనతి కాలంలోనే పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇన్ని రోజులు ఈ బాధ్యతలను నిర్వహించడం గర్వకారణంగా ఉందని, ఆ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లగల సమర్థత జస్టిస్ ఖన్నాలో పుష్కలంగా ఉందని జస్టిస్ డీవై చంద్రచూడ్ కితాబు ఇచ్చారు.
జస్టిస్ ఖన్నా ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ సభ్యుడిగాను ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా కుమారుడే జస్టిస్ సంజీవ్ ఖన్నా. 1980లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు ఖన్నా. అనంతరం క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయ విద్యను పూర్తి చేశారు.
Also Read: మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో, రైతుల రుణమాఫీ, 25 లక్షల ఉద్యోగాలు..
1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు అయిన జస్టిస్ ఖన్నా.. హైకోర్టులో అనేక కేసుల్లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అమికస్ క్యూరీగా వాదనలు వినిపించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ ఖన్నా, 2006లో పర్మినెంట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కాకుండా.. సుప్రీం కోర్టుకు ప్రమోట్ అయిన అరుదైన న్యాయమూర్తులలో జస్టిస్ ఖన్నా ఒకరు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రకటించిన తీర్పు.. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక తీర్పుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా భాగస్తులయ్యారు.