trinayani serial today Episode: సుమన కంగారుగా పరుగెత్తుకుంటూ సిస్టర్ దగ్గరకు వెళ్లి త్రినయని కండీషన్ ఎలా ఉందని అడుగుతుంది. అసలు బతికే చాన్స్ ఉందా? అని ఆరా తీస్తుంది. సిస్టర్ నాకేం తెలియదు అని వెల్లిపోతుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి సుమనను తిడతాడు. సిస్టర్స్ ను అడిగితే వాళ్లేం చెప్తారు అంటూ సుమనను తిడుతూ మీ అమ్మ కడుపున ఇద్దరు పుట్టారు కదా..? మీ అక్కకు ఏమీ కాకూడదని ఎప్పుడైనా దేవుడికి మొక్కావా..? అని అడుగుతాడు. దీంతో మెక్కితే ప్రాణాలు నిలబడతాయా..? మెరుగైన వైద్యం అందించాలి అంటుంది సుమన. దీంతో విక్రాంత్ చీ నీ ముఖం చూసి మాట్లాడటం నాది బుద్ది తక్కువ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు విక్రాంత్.
ఐసీయూ దగ్గర విశాల్ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో హాసిని వచ్చి డాక్టర్లు ఏమైనా చెప్పారా..? అని అడుగుతుంది. ఇంకా ఏమీ చెప్పలేదని లోపలి నుంచి డాక్టర్లు ఇంకా రాలేదని చెప్తాడు విశాల్. అలా అయితే ఎలా ఏదో ఒకటి చెప్పాలి కదా… డాక్టర్లు అంటుంది సుమన. తిలొత్తమ్మ కూడా అవును ఇంత సమయం అవుతుంది ఇంకా డాక్టర్లు బయటకు రాకపోతే ఎలా… మనం ఎంత టెన్షన్ పడతాం అంటుంది.
మరోవైపు బామ్మను తీసుకుని హాస్పిటల్ రూంలోంచి బయటకు వస్తుంటుంది త్రినేత్రి. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ మంటగా ఉందని బామ్మ డాక్టర్ ను తిడుతుంది. ఆ ఇంజక్షన్ వేస్తేనే నీకు బాగవుతుందని డాక్టర్ చెప్పాడు బామ్మ అంటుంది త్రినేత్రి. నువ్వు ఇలా ఎవరు ఎం చెబితే అది నమ్మకు నీకు విశాల్ బాబుతో పెళ్లి అయితే నాకు గుండె పోటు వచ్చి పైకి పోయినా పర్వాలేదు. నీ పెళ్లి కాగానే నేను మీ తాతయ్య గారితో స్వర్గంలో కాలక్షేపం చేస్తాను. అని బామ్మ చెప్తుండగానే ఇంతలో మెడిసిన్స్ రూంలోనే మర్చిపోయానని అక్కడే బామ్మను కూర్చోబెట్టి లోపలికి వెళ్తుంది త్రినేత్రి.
ఐసీయూలోంచి డాక్టర్ వస్తుంది. అందరూ నయనికి ఎలా ఉందని అడుగుతారు. కండీషన్ క్రిటికల్ గానే ఉందని 48 గంటలు గడిస్తే తప్పా ఏమీ చెప్పలేమని డాక్టర్ చెప్తుంది. అందరూ కంగారుపడుతుంటారు. ఇంతలో దూరం నుంచి చూస్తున్న బామ్మ వార్డెన్‌ను పిలిచి అక్కడ ఏమి గొడవ జరగుతుందని అడుగుతుంది. యాక్సిడెంట్ అయింది. ఆమె బతుకుతుందో లేదోనని అంటున్నారు అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు ఎంత డబ్బైనా పర్వాలేదు బెటర్ ట్రీట్ మెంట్ ఇవ్వమని విశాల్ అంటాడు.
ఇంతలో హాసిని ఏడుస్తూ డాక్టర్ దయచేసి మా చెల్లెలిని ఎలాగైనా కాపాడండి అని డాక్టర్ కాళ్లు మొక్కబోతుంటే విశాల్ వద్దని వారిస్తాడు. ఇంతలో అందరూ లోపలికి వెళ్తారు. విక్రాంత్ ఒక్కడే బయట ఉండి డాక్టర్ ను నిజం చెప్పమని అడుగుతాడు. దీంతో డాక్టర్ నయని కోమాలొకి వెళ్లిందని.. తిరిగి ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేమని అనడంతో విక్రాంత్ షాక్ అవుతాడు. ఏడుస్తూ అక్కడే కూర్చుండి పోతాడు. లోపలికి వెళ్లిన విశాల్ కూడా నయనిని చూసి ఏడుస్తుంటాడు.
అక్కడే కూర్చుని ఏడుస్తున్న విక్రాంత్‌ను బామ్మ పలకరిస్తుంది. ఏమైందని అడుగుతుంది. మా వదినకు యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిందని చెప్పి ఏడుస్తుంటే.. విక్రాంత్ ను బామ్మ ఓదారుస్తుంది. ఫోన్ మాట్లాడటానికి బయటకు వెళ్లిన వల్లభ త్రినేత్రిని చూసి దెయ్యం అనుకుంటూ భయంతో ఐసీయూ దగ్గరకు పరుగెతుకెళ్తాడు. ఇంతలో త్రినేత్రి బామ్మ దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్తుంటే ఏడుస్తున్న విక్రాంత్‌కు త్రినేత్రి సరిగ్గా కనిపించదు.
చెల్లిని ఇలా చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటే హాసిని ఏడుస్తుంది. హాసినిని సుమన ఓదారుస్తూ తోడబుట్టిన దాన్ని నేనే ధైర్యంగా ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు అక్కకు ఏం కాదు రెండు రోజుల్లో అందరినీ పలకరిస్తుంది చూడు అని చెప్తుంది. ఇంతలో వల్లభ కంగారుగా లోపలికి పరుగెత్తుకొస్తూ.. నయని ఇక్కడే ఉందా? అని అడుగుతాడు. పేషెంట్ ఇక్కడ ఉండగా మరి ఎక్కడ ఉంటుందిరా అంటుంది తిలొత్తమ్మ. దీంతో వల్లభ ప్రాణాలతోనే ఉందా..? అని అడగ్గానే విశాల్ కోపంగా ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని కసురుకుంటాడు. దీంతో ఇప్పుడు నయని చనిపోయి దెయ్యంలా మారిందని నేను చెప్తే అందరూ నన్ను కొడతారేమోనని మనసులో అనుకుని సైలెంట్ గా ఉండిపోతాడు.
ఇంట్లో భయపడుతూ ఫోన్ లో టార్చ్ వేసుకుని కూర్చుంటాడు వల్లభ. తిలొత్తమ్మ రాగానే అమ్మో దెయ్యం అంటూ భయంతో వణికిపోతుంటాడు. దీంతో ఓరేయ్ నేను మీ అమ్మను రా.? అంటూ వల్లభను తిడుతుంది. దీంతో వల్లభ హాస్పిటల్ లో నేను నయని ఆత్మను చూశానని చెప్పడంతో నువ్వు భ్రమలో ఉన్నావురా..? నయని ప్రాణం పోతే విశాల్‌కు తెలియాల్సిన అవసరం లేదని ఆటోమాటిక్ గా తన గుండె ఆగిపోతుంది అంతటి ప్రేమికులు వాళ్లిద్దరు అంటుంది తిలొత్తమ్మ. దీంతో పిల్లలు పుట్టాక కూడా ఇంకా ప్రేమేంటి మమ్మీ అంటాడు వల్లభ. అందరూ నీలాగా కాదురా అంటుంది తిలొత్తమ్మ.
విక్రాంత్ ఆలోచిస్తూ కూర్చుంటే సుమన వస్తుంది. విక్రాంత్ ఏమీ పలకకుండా కూర్చుని ఉంటాడు. దీంతో నేను వచ్చినా కూడా మీరు ఉలకడం లేదేంటి అని అడుగుతుంది. సరే మీ ఇష్టం కానీ నా ఫోన్ లో సిగ్నల్ సరిగ్గా లేదు కాస్త నాకు ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెడతారా..? అంటూ చెప్పగానే విక్రాంత్ కోపంగా సుమనను తిడతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.