BigTV English

Kalamassery Blasts : కేరళ పేలుళ్ల కేసు.. నేనే బాధ్యుడినంటూ లొంగిపోయిన నిందితుడు

Kalamassery Blasts : కేరళ పేలుళ్ల కేసు.. నేనే బాధ్యుడినంటూ లొంగిపోయిన నిందితుడు

Kalamassery Blasts : కేరళ పేలుళ్ల కేసులో అనూహ్య పరిణామం జరిగింది. పేలుళ్లకు తానే బాధ్యుడిని అంటూ కేరళ పోలీసుల ముందు లొంగిపోయాడు ఓ వ్యక్తి. కేరళ ADGP ముందు లొంగిపోయిన అతడిని డొమినిక్ మార్టిన్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు కూడా పేలుడు జరిగిన చర్చికు సంబంధించిన వ్యక్తిగానే ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. అయితే మిగతా విషయాలన్ని దర్యాప్తు జరిపాకే తెలుపుతామంటున్నారు పోలీసులు.


ఈ పేలుళ్లలో ఒకరు ఒకరు మృతిచెందగా, 36 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. లామస్సేరి నెస్ట్‌ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగంది. అయితే ప్రస్తుతం లొంగిపోయిన మార్టిన్‌కు అసలు ఐఈడీ ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే టిఫిన్‌ బాక్స్‌లో ఐఈడీని తీసుకొచ్చి పేలుడు జరిపారని ప్రాథమికంగా నిర్ధారించారు కేరళ పోలీసులు.

మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే కేరళలో ల్యాండ్‌ అయ్యాయి. ఉగ్రవాద కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్లు ఇప్పటికే అనుమానిస్తున్నారు. NIA టీమ్‌ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటనకు మూలాలు గుర్తించేందుకు 8 మందితో కూడిన NSG టీమ్‌తో పాటు మరికొన్ని ఏజెన్సీలో కేరళకు చేరుకున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేరళ సీఎంకు ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీసారు.


ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ పేలుడు జరిగింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 2 వేలకు పైగా వచ్చారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. పేలుడు సంభవించడంతో అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కేరళలో బాంబు పేలుడుతో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. కేరళలో కూడా హైఅలర్ట్ ప్రకటించి.. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిఘా వర్గాల సమాచారంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా హైఅలర్ట్ ప్రకటించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×