Big Stories

Karnataka Elections : కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. 5 కీలక హామీలు..

Karnataka Elections(Political News Updates) : కర్ణాటకలో ఎన్నికలకు వారం రోజుల మాత్రమే సమయం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. హంగ్ వస్తే తమకు అవకాశం దక్కుతుందని జేడీఎస్ ఆశపడుతోంది. రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది. పార్టీలన్నీ ప్రజలపై హామీల వరాలు కురిపిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టో విడుదల చేసింది.

- Advertisement -

గ్యారెంటీ కార్డు పేరుతో కాంగ్రెస్ 5 కీలక హామీలు ఇచ్చింది. ప్రతి గృహిణికి రూ. 2 వేల నగదు, అలాగే 10 కిలోల ఉచిత బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ హామీలు ఇచ్చింది. నిరుద్యోగ భృతి కింద రూ. 3 వేల నగదు హామీని మేనిఫెస్టోలో పొందుపర్చింది. మధ్యతరగతి, నిరుద్యోగులు, మహిళలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

- Advertisement -

సోమవారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 103 హామీలు ఇచ్చింది. ఇందులో 16 ముఖ్యమైన హామీలున్నాయి. మేనిఫెస్టోను ‘విజన్​ డాక్యుమెంట్​’గా అభివర్ణించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్నారు.పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు , రోజూ అర లీటర్ నందిని పాలు ఉచితంగా ఇస్తామన్నారు. ఇలా చాలా హామీలు బీజేపీ ఇచ్చింది.

మరోవైపు ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ సర్కార్ పై మరోసారి విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. ప్రతి పనికి కాంట్రాక్టర్ నుంచి 40 శాతం కమీషన్ తీసుకుంటున్న బీజేపీని.. ఈ ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితం చేయాలన్నారు. కర్ణాటకలో 150 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బీజేపీ.. ఎమ్మెల్యేలకు డబ్బులు పంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. బీజేపీ అంటే.. కర్ణాటకలో అవినీతి మాత్రమే గుర్తుకొస్తుందని విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రజలు ఈ ప్రభుత్వాన్ని 40 శాతం ప్రభుత్వం అని పిలుస్తున్నారని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News