E-Paper
Advertisement

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాసలీలలు వీడియో ఎఫెక్ట్, సీనియర్ ఐపీఎస్ సస్పెండ్

Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాసలీలలు వీడియో ఎఫెక్ట్, సీనియర్ ఐపీఎస్ సస్పెండ్
Advertisement

Karnataka: సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావు విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఆఫీసులో ఆయన మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో దుమారం మొదలైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రభుత్వం, తాజాగా చర్యలు చేపట్టింది. మంగళవారం ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావును సస్పెండ్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. డీజీపీ ఆఫీసులో ఆయన ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు రావడంతో ఇంటా బయటా దుమారం మొదలైంది. పరిస్థితి గమనించిన ప్రభుత్వం, ఆయనపై వేటు వేసింది. ఆయన ప్రవర్తన యంత్రాంగానికి ఇబ్బందిగా మారిందని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రస్తావించింది.

ఓ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన నిబంధనలు ఉల్లంఘించారని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. సస్పెన్షన్‌ సమయంలో ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్‌క్వార్టర్స్‌ని విడిచి వెళ్లకూడదని ఆదేశించింది కూడా. విచారణ తర్వాత రామచంద్రరావుపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వరరావు తెలిపారు.

Advertisement

రాసలీలలు వీడియో ఎఫెక్ట్, సీనియర్ ఐపీఎస్ సస్పెండ్

ఆయన తప్పు చేసినట్టు తేలితే డిస్మిస్ చేస్తామన్నారు. తన ఆఫీసులో రామచంద్రరావు అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. ఈ అంశాన్నితీవ్రంగా పరిగణించిన సిద్ధరామయ్య సర్కార్, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. తనపై ఎవరో కుట్ర పన్ని ఏఐతో వీడియోలు చేశారని రామచంద్రరావు వాదన. ఈ ఏడాది మే నెలలో రామచంద్రరావు పదవీ విరమణ చేయనున్నారు. మరో నాలుగు నెలల పదవీకాలం ఉండగానే ఆయన సస్పెండ్‌ అయ్యారు.

ఈ ఏడాది మే నెలలో రామచంద్రరావు పదవీ విరమణ చేయనున్నారు. మరో నాలుగు నెలలు ఉండగానే ఆయన్ని సస్పెండ్‌కు గురయ్యారు. ఇదిలావుండగా రామచంద్రరావు వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. బళ్లారికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ప్రధానమంత్రి కార్యాలయానికి, సిబ్బంది-శిక్షణ శాఖకు లేఖ రాశారు. అధికారం, ప్రభుత్వ కార్యాలయం, పోలీసు యూనిఫామ్‌ని ఆయన దుర్వినియోగం చేశారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించారు.

ALSO READ: బీజేపీ అధ్యక్షుడిగా నితిన్ ఎంపిక.. ఆయనే మా బాస్ అన్న ప్రధాని

ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది విపక్ష బీజేపీ. ఇది క్షమించరాని నేరంగా వర్ణించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్ సురేష్ కుమార్. పోలీసు బలగాల విశ్వసనీయతపై దెబ్బ తీసేలా ఉందని, జాతీయ జెండాకు అగౌరవ పరిచారన్నారు. ప్రభుత్వం ఆ అధికారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయన వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

Related News

డీజీపీ అనురాగ్‌ సూసైడ్‌, విచారణకు ప్రభుత్వ ఆదేశం, ఆఫీసులో ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

Big Stories

Advertisement
×