Big Stories

Katchatheevu Island Controversy: కచ్చతీవు ద్వీపం వివాదం.. ప్రధాని మోదీకి ఖర్గే అదిరిపోయే కౌంటర్..

Katchatheevu Island Controversy
Katchatheevu Island Controversy

Katchatheevu Island Controversy: కచ్చతీవు ద్వీపం ఇండియా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం కచ్చతీవు ద్వీపంపై ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా ఆ ద్వీపాన్ని శ్రీలంక‌కు అప్పగించారని పేర్కొన్నారు. అసలు కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అప్పగించిందో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆర్టీఐ వేశారు. దాని నివేదిక ఆధారంగా ప్రధాని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు.

- Advertisement -

ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బదులిస్తూ, 1974లో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన భూసరిహద్దు ఒప్పందం తరహాలోనే.. భారత్ శ్రీలంక మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగిందని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.

- Advertisement -

తమిళనాడులో ఎన్నికల సందర్భంగా ఈ సున్నితమైన అంశాన్ని లేవనెత్తారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే 2014లో అప్పటి అటార్నీ జనరల్ శ్రీ ముకుల్ రోహ్తగీ కచ్చతీవు ద్వీపంపై సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

“1974లో ఒప్పందం ద్వారా కచ్చతీవు శ్రీలంకకు వెళ్లింది. ఈరోజు దాన్ని ఎలా వెనక్కి తీసుకోవచ్చు? మీరు కచ్చతీవును తిరిగి పొందాలనుకుంటే, దానిని తిరిగి పొందేందుకు మీరు యుద్ధం చేయవలసి ఉంటుంది” అని ముకుల్ రోహ్తగీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా అని ఖర్గే ప్రధాని మోదీని ప్రశ్నించారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై ఖర్గే ధ్వజమెత్తారు. “గాంధీ, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ – మన ప్రియమైన నాయకులందరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రాణాలర్పించారు. 600 సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారు. దీనికి విరుద్ధంగా, గాల్వాన్ వ్యాలీలో 20 మంది ధైర్యవంతులు అత్యున్నత త్యాగం చేసిన తర్వాత మీరు, చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారు” అని మోదీని ప్రశ్నించారు.

మాల్దీవులు, నేపాల్‌తో ఘర్షణలు, దౌత్యపరమైన ఉద్రిక్తతల గురించి ఖర్గే మాట్లాడుతూ, “నేపాల్, భూటాన్, మాల్దీవులు వంటి స్నేహపూర్వక పొరుగు దేశాలలో కూడా మీరు యుద్ధ స్థాయిని ఎలా పెంచారనేది ఆశ్చర్యపరిచే విషయం కాదా” అని ప్రధాని మోదీపై ఖర్గే విరుచుకుపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News